ఒడిశా రైలు ప్రమాద ఘటన.. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన CBI

దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం. బాలాసోర్ సమీపంలో మూడు రైలు ఢీ కొన్న విషాద ఘటనలో ఏకంగా 293 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం యావత్‌ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాద స్థలంలో శవాల గుట్టలు కన్నీరు పెట్టని మనిషి లేడు. అలాంటి దారుణ ఘటన చిన్న నిర్లక్ష్యం కారణంగా జరిగిందని తెలిసి కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపింది.

ప్రమాదం తర్వాత విచారణ చేపట్టిన సీబీఐ తాజాగా ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్‌ చేసింది. వారిలో సిగ్నలింగ్‌ విభాగంలో ఇంఛార్జ్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అరుణ్‌ కుమార్‌ మహాంత, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ అమీర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌ యాదవ్‌లను సీబీఐ అరెస్ట్‌ చేసింది. వీరు ముగ్గురు బాలాసోర్‌ జిల్లాలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ ప్రమాదంలో 293 మృతి చెందగా.. 1100 మంది వరకు గాయపడ్డారు. ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా ఇంకా 42 శవాలను గుర్తించలేకపోయారు అధికారులు. వాటికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరి ఈ ప్రమాద ఘటనలో ముగ్గురిని సీబీఐ అరెస్ట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments