iDreamPost
android-app
ios-app

వీడియో: కారు ఢీకొట్టగానే గాల్లోకి ఎగిరి పడ్డారు!

  • Published Jul 27, 2023 | 2:57 PM Updated Updated Jul 27, 2023 | 2:57 PM
  • Published Jul 27, 2023 | 2:57 PMUpdated Jul 27, 2023 | 2:57 PM
వీడియో: కారు ఢీకొట్టగానే గాల్లోకి ఎగిరి పడ్డారు!

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయిపోయాయి. తప్పు ఒకరిదైతే దాని తాలూకా ఫలితం వేరే వాళ్లు అనుభవిస్తున్నారు. అతి వేగం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవటం వంటి కారణాల వల్ల దేశవ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. తాజాగా, బైకు యూటర్న్‌ తీసుకోవటం వల్ల ఓ ముగ్గురి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ సంఘటన కర్ణాటకలోని రాయచూరులో చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తి తన బైకుపై వెళుతూ ఉన్నాడు. ఓ చోట యూటర్న్‌ తీసుకున్నాడు. దీంతో అటు వైపునుంచి వస్తున్న కారు వేగంగా బైకును ఢీకొట్టింది. దీంతో బైకు గాల్లోకి ఎగిరి కిందపడింది. దానిపై ఉన్న వ్యక్తి కూడా రోడ్డుపై పడిపోయాడు. కారు అంతటితో ఆగకుండా పక్కు తిరిగి.. అదే రోడ్డుపై వెళుతున్న ఓ ముగ్గురు విద్యార్థినులను ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి ఓ అమ్మాయి అక్కడే పడగా.. మరో అమ్మాయి గాల్లోకి ఎగి మీటర్ల రూరంలో పడింది.

రోడ్డుపై నానా భీభత్సం సృష్టించిన కారు ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. ఇక, కారు కారణంగా మొత్తం ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు ముగ్గుర్నీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కా​మెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio