iDreamPost
android-app
ios-app

బస్సులో గోల్డ్ చైన్ పొగొట్టుకున్న యువతి.. నిజాయితీని చాటుకున్న డ్రైవర్!

బంగారం ధర పెరుగుతుంది. సామాన్యుడు కొనలేని స్థాయికి చేరింది. చివరకు బయటకు వేసుకెళ్లాలన్న భయం వేస్తుంది. ఎక్కడైనా పొగొట్టుకుంటామోనని, అలాగే దొంగలు దోచుకెళతారేమోనని. పోయిన తర్వాత దొరకడం చాలా కష్టం. కానీ

బంగారం ధర పెరుగుతుంది. సామాన్యుడు కొనలేని స్థాయికి చేరింది. చివరకు బయటకు వేసుకెళ్లాలన్న భయం వేస్తుంది. ఎక్కడైనా పొగొట్టుకుంటామోనని, అలాగే దొంగలు దోచుకెళతారేమోనని. పోయిన తర్వాత దొరకడం చాలా కష్టం. కానీ

బస్సులో గోల్డ్ చైన్ పొగొట్టుకున్న యువతి.. నిజాయితీని చాటుకున్న డ్రైవర్!

ఇప్పుడు బంగారం ధర కొండనెక్కి కూర్చుంది. సామాన్యులు పసిడి కొనలేని పరిస్థితికి చేరింది. ఇక కొనగలమా అన్న సందిగ్దత నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఇంట్లో భారీగా బంగారం కొనుగోలు చేసిన వారికి గోల్డ్ పెరుగుదల సంతోషాన్ని ఇస్తుంది. ప్రస్తుతం పసిడి ఆర్థిక అవసరాలకు అక్కరకు రావడంతో మహిళలే కాదు.. పురుషులు కూడా బంగారం కొనుగోలు పెట్టుబడులపై ఆసక్తిని చూపుతున్నారు. ఈ రోజుల్లో చినం బంగారం కూడా విలువైనదిగా మారడంతో బయటకు వేసుకెళ్లేందుకు భయపడిపోతున్నారు ప్రజలు. ఒకసారి పొగొట్టుకుంటే.. దక్కడం చాలా కష్టం. సాధారణంగా రాకపోకల సమయంలో గోల్డ్ వస్తువులు పోతుంటాయి లేదా కేటుగాళ్లు కొట్టేస్తుంటారు. కానీ పోయిన వస్తువు తిరిగి దొరకడం అంటే కల్ల.

బంగారం వస్తువు లభిస్తే.. ఎవరైనా లటుక్కున తీసుకుంటారు తప్ప తిరిగి ఇవ్వడం కష్టం. తిరిగి ఇవ్వాలన్న మనస్సు రాదు. అయితే ఈ డ్రైవర్ మాత్రం తన మంచి మనస్సును చాటుకున్నాడు. ఓ అమ్మాయి తన గోల్డ్ చైన్ పోగొట్టుకోగా..మానవత్వం ప్రదర్శించి.. తిరిగి ఆ యువతికి ఇచ్చేశాడు. నిజాయితీ ఇంకా మిగిలే ఉందని నిరూపించిన ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. జూన్ 20న బ్రహ్మావర్ నుంచి కుందాపూర్ వెళ్తున్న బస్సులో ప్రయాణించిన యువతి.. తన బంగారు గొలుసు పోగొట్టుకుంది. అయితే ఓ ప్రయాణీకుడు గోల్డ్ చైన్ చూసి.. ఎవరో పడేసుకున్నారని గుర్తించి బస్సు కండక్టర్‌, డ్రైవర్‌కు ఇచ్చాడు. కాగా, కాసేపటికి తన మెడ చూసుకున్న బాలిక.. చైన్ పోవడాన్ని చూసి కంగారు పడి.. ఏడ్వడం స్టార్ చేసింది.

తర్వాత బస్సులో పోయి ఉంటుందని గ్రహించింది. అంతలో  బస్సు ఏజెంట్ ఆమెను ఏమైందని ప్రశ్నించగా.. చైన్ పోగొట్టుకున్న విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె వద్ద నుంచి టికెట్ తీసుకున్న ఏజెంట్ బస్సు డ్రైవర్‌ను సంప్రదించి యువతి బంగారు గొలుసు పోయిన విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆ చైన్ వారి వద్ద ఉండగా.. బస్సు డ్రైవర్ ఆమెకు ఆ గొలుసు అప్పగించాడు. నిజాయితీని ప్రదర్శించి.. చైన్ అప్పగించిన బస్సు డ్రైవర్, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపింది యువతి, ఆమె కుటుంబం. అలాగే యాజమాన్యం కూడా వీరిని ప్రశంసలతో ముంచెత్తింది. వారి నిజాయితీని చూసి పలువురు కొనియాడుతున్నారు.