iDreamPost
android-app
ios-app

వీడియో: బయట చూస్తే కప్‌బోర్డ్‌.. లోపల మాత్రం భారీ ఉగ్ర స్థావరం! ఎక్కడంటే..

Jammu and Kashmir: రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో ని కుల్గామ్ లో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో ఆర్మీ అధికారులు విచారణ చేపట్టగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Jammu and Kashmir: రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో ని కుల్గామ్ లో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో ఆర్మీ అధికారులు విచారణ చేపట్టగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వీడియో: బయట చూస్తే కప్‌బోర్డ్‌.. లోపల మాత్రం భారీ ఉగ్ర స్థావరం! ఎక్కడంటే..

దేశంలో తరచూ ఏదో  ఒక ప్రాంతంలో ఉగ్రవాద ఘాతుకాలు జరుగుతూనే ఉంటాయి. అలానే ఇండియన్ ఆర్మీ… ఉగ్రవాదుల కదలికలను గుర్తించి.. ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం ఇస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవలే జమ్మూ కశ్మీర్ లోని కుల్గామ్  ప్రాంతంలో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే  అక్కడ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల తెలివి చూసి…ఆర్మీసైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బయట నుంచి కప్ బోర్డులో కనిపిస్తూ..లోపల మాత్రం పెద్ద ఉగ్ర స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ విషయంపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో ని కుల్గామ్ లో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో ఆర్మీ అధికారులు విచారణ చేపట్టగా.. ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రజల నివాసాల మధ్యలోనే ఉగ్రవాదులు బంకర్లను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం కుల్గామ్ జిల్లాలోని  చిన్నిగామ్‌ ఫీసల్‌లో ఒకేచోట నలుగురు హిజ్బుల్‌ ఉగ్రవాదులను ఆర్మీ సైన్యం  ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా  అధికారులు విడుదల చేశారు.

ఇక ఈ ఎన్ కౌంటర్ ఈసందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన అంశాన్ని ఆర్మీ అధికారులు పసిగట్టారు. ఓ ఇంట్లో బయట నుంచి కప్‌బోర్డ్‌ కనిపించింది. దానిని పై అనుమానంతో  ఆర్మీ దళం ఓపెన్ చేయగా.. ఆశ్చరం కలిగించే దృశ్యం కనిపించింది. బయట నుంచి కప్ బోర్డులో కనిపించి..దానిలో ఉగ్రవాదులు ఏకంగా బంకర్‌ నిర్మించుకొన్నారు. దీనిని పూర్తిగా కాంక్రీట్‌తో నిర్మించినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. బయట నుంచి చూడటానికి చాలా చిన్నదిగా కనిపించినా.. లోపల మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ బంకర్ లోకి వెళ్లేందుకు బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిని ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కప్ బోర్డులా కనిపించే.. ఈ బంకర్ లోకి ఒక మనిషి పాకు కుంటూ ప్రవేశించవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేత ఒకరు ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఇక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హంతంగా, ఓ జవాన్ అమరుడయ్యాడు.  కొన్నేళ్ల క్రితం టెర్రరిస్టులు మరుగుదొడ్ల కింద బంకర్లు ఏర్పాటు చేసుకొంటున్నట్లు ఆర్మీ గుర్తించింది. దీంతో వాటిపై ఆర్మీ అధికారులు దృష్టిపెట్టారు. 2019లో లస్సీపుర వద్ద సైన్యం ఒక ఇంటిలోని సెప్టిక్‌ ట్యాంక్‌ను తెరవగా.. ఇద్దరు ఉగ్రవాదులు అందులోని బంకర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇలా చాలా స్థావరాలు కిచెన్లు, బెడ్‌రూమ్‌లు, డ్రాయింగ్‌ రూమ్‌ల మాటున ఉంటున్నట్లు సైన్యం గమనించింది. తాజాగా కప్ బోర్డు రూపంలో మరో ఉగ్రవాదుల బంకర్ ను ఆర్మీ గుర్తించింది.