Arjun Suravaram
సెలబ్రీటీలకు, రాజకీయ నాయకులకు గుడి కట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఓ గ్రామం మాత్రం విచిత్రంగా బైక్ కి గుడి కట్టాడు. మరి.. అందుకు వారు చెప్పిన కారణాలు అందరని ఆశ్చర్యానికి గురి చేశాయి.
సెలబ్రీటీలకు, రాజకీయ నాయకులకు గుడి కట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఓ గ్రామం మాత్రం విచిత్రంగా బైక్ కి గుడి కట్టాడు. మరి.. అందుకు వారు చెప్పిన కారణాలు అందరని ఆశ్చర్యానికి గురి చేశాయి.
Arjun Suravaram
ప్రపంచంలోని ఏ దేవాలయంలో అయినా.. మనకు దేవుడు లేదా దేవత విగ్రహాలు దర్శనమిస్తాయి. కొంతమంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధి గాంచిన వారి జ్ఞాపకార్థం… అభిమానంతో గుడులు కట్టిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ, ఒక ఆలయంలో వేరే ఏ దేవుడు,దేవత లేకుండా బుల్లెట్ బైక్ ను దేవతగా కొలుస్తారంటే నమ్మగలమా!. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వాస్తవం. ఇప్పటివరకు మనం రోడ్ మార్గంలో వెళ్ళేటపుడు హైవేల పక్కన ఉండే అనేక దేవాలయాలను సందర్శించి ఉంటాం. కానీ, జోధ్‌పూర్, అహ్మదాబాద్‌లను కలుపుతూ .. జాతీయ రహదారి 62లో వెళ్తున్నపుడు మాత్రం ఓ విచిత్ర ఆలయం కనిపిస్తుంది. అదే బుల్లెట్ బాబా ఆలయం. దీని వెనుక ఉన్న కథనాల గురించి తెలుసుకుందాం.
ఈ ఆలయంలో ఆర్ఎన్ జే 7773 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన 350 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ ను.. దేవతగా పూజిస్తారు. ఈ బైక్ యజమాని ఓం సింగ్ రాథోడ్. ఇతను 1988లో బులెట్ పై వెళ్తున్నపుడు అనుకోని ప్రమాదంలో మరణించాడు. సరిగ్గా ఆ ప్రమాదం జరిగిన స్థలంలోనే.. ఈ ఆలయాన్ని నిర్మించారు గ్రామస్థులు. ఈ ఆలయంలో అతని ఫోటో, విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. దీనిని ఓం బన్నా మందిరం లేదా బుల్లెట్ బాబా ఆలయం అని పిలుస్తూ ఉంటారు. అయితే, కేవలం అతను చనిపోయిన కారణంగా ఈ ఆలయాన్ని నిర్మించలేదు. దీని వెనుక ఆ గ్రామస్థుల నమ్మకాలతో కూడిన ఓ కథ దాగి ఉంది.
స్థానిక జానపద కథనాల ప్రకారం, ఓం సింగ్ రాథోడ్ బైక్ తో సహా ప్రమాదానికి గురి అయిన తర్వాత.. పోలీసులు ఆ బైక్ ను దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. అయితే, ఆ తర్వాత రోజు ఉదయం ఆ బైక్ పోలీస్ స్టేషన్ లో కాకుండా.. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రత్యేక్షమయ్యిందట. “పోలీసులు దాన్ని వెనక్కి తీసుకున్నారు కానీ మళ్లీ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లింది. గ్రామస్తులు ఒక మందిరాన్ని నిర్మించాలని నిర్ణయించుకునే వరకు.. ఇది కొన్ని రోజుల పాటు కొనసాగింది. మరియు, అతను ఎన్ హెచ్- 62 యొక్క పోషకుడిగా మారాడు, ప్రజలను ప్రమాదాల నుండి రక్షించాడు” అని కొండవార్ రాశారు. ఈ బులెట్ బైక్ టెంపుల్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇది.
ఇంకా.. కొత్తగా బైక్స్ కొన్నవారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారట. పైగా, ఈ గుడి దగ్గర ఓ చెట్టు కూడా ఉంది. ప్రజలు ఆ చెట్టుకి ఓ ఎర్రటి దారం కట్టి.. బులెట్ బాబాపై తనకున్న విశ్వాసాన్ని చూపిస్తారట. కాగా, ఈ ఆలయంలో ఇంకొక విచిత్ర పద్ధతి కూడా ఉంది. మందిరం అంతా చూడడానికి సాంప్రదాయ దేవాలయంలా ఉన్నప్పటికీ అక్కడ పవిత్రం జలం ఉండదు. దానికి బదులుగా, అక్కడి ప్రజలు ఆచరంలో భాగంగా విస్కీ బాటిల్‌ను తీసుకువస్తారట. రాజస్థాన్ లోను ‘ఓం బన్నా’కి సంబంధించి చాలా ఆలయాలు చాలా ఉన్నాయి. ఇక ఈ వెరైటీ ఆలయం సామజిక మాద్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రత్యేకమైన వార్తల్లో నిలిచిన బుల్లెట్ బాబా ఆలయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.