iDreamPost
android-app
ios-app

కేరళ వరదల్లో అద్భుత దృశ్యం! భార్యని బతికించుకోడానికి ఓ భర్త సాహసం!

దైవ భూమిలో ప్రకృతి విలయతాండవం చేసింది. వానలు, వరదలకు వయనాడ్ అతలాకుతలం అయ్యింది. నాలుగు ప్రాంతాలు తుడుచుకు పెట్టుకుపోయాయి. శవాల దిబ్బగా మారిపోయింది ఆ ప్రాంతం. కాగా,

దైవ భూమిలో ప్రకృతి విలయతాండవం చేసింది. వానలు, వరదలకు వయనాడ్ అతలాకుతలం అయ్యింది. నాలుగు ప్రాంతాలు తుడుచుకు పెట్టుకుపోయాయి. శవాల దిబ్బగా మారిపోయింది ఆ ప్రాంతం. కాగా,

కేరళ వరదల్లో అద్భుత దృశ్యం! భార్యని బతికించుకోడానికి ఓ భర్త సాహసం!

కేరళ వరదలు దేశాన్ని కుదిపేశాయి. వయనాడ్ జిల్లాలోని నాలుగు గ్రామాలను వరద ముంచెత్తింది.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కొండ చరియలు విరిగిపడటంతో 2018 తీవ్ర విషాద ఘటన మరోసారి పునరావృతమైంది. మెప్పడి, ముండక్కయి, చారోల్ మల ప్రాంతాల్లో జరిగిన ప్రకృతి విలయతాండవానికి 224 మంది మరణించారు. చలియార్ నడి నుండి సుమారు 83 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలుస్తుంది. ఇంకా 225 మంది మిస్సింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ముమ్మురంగా సహాయక చర్యలు చేపడుతోంది రెస్క్యూ టీం. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇంకా అక్కడ పలు జిల్లాలను వానలు ముంచెత్తుతున్నాయి.

ఈ సమయంలో ఓ భర్త తన నిండు గర్భిణీ అయిన తన భార్య కోసం రిస్క్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. కేరళలో పలు జిల్లాలో వానలు ముంచెత్తుతుననాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇడుక్కిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఓ నది ఉగ్ర రూపం దాల్చింది. నదిపై కట్టిన ఆనకట్ట నుండి ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఈ సమయంలో వేగంగా ప్రవహిస్తున్న నీటిలో వంతెన దాటాలంటే ప్రాణాలపై నమ్మకం వదిలేసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితులో గర్భిణీ అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తన దగ్గర ఉన్న 800 సీసీ మారుతి ఆల్టో కారులో ఎంతో చాక చక్యంగా బండి నడిపి తీసుకెళ్లాడు. బ్రిడ్జిపై నీరు పొంగిపొర్లుతుంటే.. అతడు చేసిన రిస్క్ చూస్తే ఊపిరి బిగబట్టాల్సిందే.

వీడియోలో కారు వంతెన క్రాస్ చేస్తుంటే.. హమ్మయ్య అని చూసేవాళ్లు కూడా ఊపురు తీసుకోవాల్సిందే.  నిజంగా అతడి గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. భార్యను బతికించుకోవడం కోసం అందులోనూ తన బిడ్డ కోసం అతడు చేసిన రిస్క్ సలాం చేస్తున్నారు. మరికొంత మంది అయితే గాడ్స్ హెల్ప్ చేశాడని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ప్రాణాలతో సేఫ్టీగా బయటపడ్డారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో స్పీడ్‌గా కారును డ్రైవ్ చేసి బ్రిడ్జిని దాటేశాడు. భార్యను ఆస్పత్రిలో చేర్పించాడని తెలుస్తుంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వయనాడ్ జిల్లాలోని నాలుగు ప్రాంతాలు కొండ చరియల ధాటికి తుడుచుకు పెట్టుకుపోయాయి. శవాల దిబ్బగా మారిపోయాయి.