iDreamPost
android-app
ios-app

సీఎం యోగికి బాంబు బెదిరింపు.. ISI ఏజెంట్ పేరుతో!

  • Published Jan 01, 2024 | 4:12 PM Updated Updated Jan 01, 2024 | 4:12 PM

Ayodhya Ram Mandir: యావత్ దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో అయోధ్య రామ మందిరానికి ఊహించని బెదిరింపులు వచ్చాయి. అది ఏమిటంటే..

Ayodhya Ram Mandir: యావత్ దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు శరవేగంగా జరుగుతున్నాయి. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో అయోధ్య రామ మందిరానికి ఊహించని బెదిరింపులు వచ్చాయి. అది ఏమిటంటే..

  • Published Jan 01, 2024 | 4:12 PMUpdated Jan 01, 2024 | 4:12 PM
సీఎం యోగికి బాంబు బెదిరింపు.. ISI ఏజెంట్ పేరుతో!

దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. దశాబ్ద కాలం నుంచి హిందువుల కల తీరే శుభ సమయం ఆసన్నం అవుతోంది. ఈ మందిరాన్ని ఎప్పుడెప్పుడు చూద్దమా అని కోట్లాది మంది ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఆ కొందాడ రాముడు తన జన్మ భూమిలో కొలువుదీరనున్నాడు. ఇక ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా రానున్నారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా అయోధ్యలోని శ్రీరామ మందిరానికి సంబంధించి ఓ ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రామాలయ ప్రారంభోత్సవ వేడుకను ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనుంది. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ రామ మందిరాన్ని పేల్చివేస్తామని ఓ ఈ మెయిల్ ద్వార బెదిరింపు వచ్చింది. కాగా, ఆ ఈ మెయిల్ భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి పంపబడింది. అలాగే ఆ మెయిల్ లో చాల అభ్యంతరకరమైన భాషను కూడా ఉపయోగించబడింది. ఇక అందులో.. అయోధ్య రామ మందిరంతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యాష్, తో పాటు తనను కూడా చంపేస్తానని బెదిరించినట్లు దేవేంద్ర తివారీ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని దేవేంద్ర తివారీ తన ఎక్స్ ఖాతాలో షేరు చేసి సమాచారం ఇచ్చారు. కాగా, ఈ మెయిల్ పంపిన వ్యక్తి పేరు జుబేర్ ఖాన్ అని ఉందని తెలిపారు. ఈ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న వ్యక్తి తనకు ఐఎస్‌ఐతో (ISI) సంబంధం ఉందని పేర్కొన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ఆగంతుడి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం యూపీ పోలీసులు, ఏజెన్సీలు విచారణను చేపట్టారు.

 

ఇక బెదిరింపు పంపించిన ఈ మెయిల్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏడీజీ అమితాబ్ యాష్, దేవేంద్ర తివారీలను గోసేవకులుగా అభివర్ణించారు. అయితే దేవేంద్ర మాత్రం ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం తనకు మొదటిసారి కాదని, ఇది వరకు చాలాసార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. కాగా, ఈ విషయం పై సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. అలాగే తనకు పోలీసుల నుంచి యిల్ ఐడీకి వచ్చింది.భరోసా తప్ప, ఎటువంటి చర్యలు తీసుకొలేదని, అధికారులు మౌనంగా ఉన్నారని దేవేంద్ర తివారీ అన్నారు. కాగా, ఈ బెదిరింపు చర్య అనేది డిసెంబర్ 27వ తేదిన సాయంత్రం జరిగింది.