Arjun Suravaram
ఎన్నో ఆశలతో కొందరు విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అలా వెళ్లిన కొందరు విద్యార్థులు సరదా సరదాగా చేసే కొన్ని పనులు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా కొందరు వైద్యవిద్యార్థులు చేసిన చిన్న తప్పు..వారి ప్రాణాలను తీసింది.
ఎన్నో ఆశలతో కొందరు విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అలా వెళ్లిన కొందరు విద్యార్థులు సరదా సరదాగా చేసే కొన్ని పనులు వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా కొందరు వైద్యవిద్యార్థులు చేసిన చిన్న తప్పు..వారి ప్రాణాలను తీసింది.
Arjun Suravaram
ఎంతో మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. అక్కడ బాగా చదువుకుని జాబ్ లు చేస్తూ.. కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంటారు. ఇలా విదేశాలకు వెళ్లిన కొందరు భారతీయ యువత విగతజీవులుగా మారుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు , రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాల కారణంగా పలువురు ఇండియన్ స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మరణించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే అమెరికాలో పలువురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారు. తాజాగా రష్యాలో కూడా నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. రష్యాలోని ఓ నదిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయారు. వీరి వయస్సు సుమారు 18 నుంచి 20 ఏళ్ల మధ్యే ఉంటుంది. శుక్రవారం ఈ ఘటన జరగ్గా..నేడు నదిలో మునిగిపోయిన వారి మృతదేహాలను స్థానిక అధికారులు వెలికి తీశారు. ఘటన జరిగిన కాసేపటికే రెండు మృతదేహాలను అక్కడి రెస్క్యూ టీమ్ వెలికి తీసింది.
శనివారం మిగిలిన రెండు బాడీలను బయటకు తీసింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థులంతా రష్యాలోని వెలిక్ నోవ్గోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వైద్య విద్య చదువుతున్నారు. శుక్రవారం ఐదుగురు కలిసి సమీపంలోని వోల్ఖోవ్ నది దగ్గరకు విహార యాత్రకని వెళ్లారు. కాసేపు ఆ ప్రాంతంలో సరదాగా సరదాగా గడిపారు. అనంతరం వారిలోని ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తునదిలో పడింది. ఆమెను కాపాడే క్రమంలో మిగిలిన నలుగురు నదిలోకి దిగారు. దీంతో ఓ విద్యార్థి ప్రాణాలతో బయట పడగా, మిగిలిన నలుగురు నదిలో మునిగిపోయి చనిపోయారు. ఈ నలుగురిలో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు.
ఇక ఈ విద్యార్థుల మృత దేహాలను భారత్ కు తీసుకు వచ్చేందుకు రష్యాలోని భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని కాన్సులేట్ అధికారులు, విద్యార్థులు చదివిన యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ సైతం స్పందించి విచారం వ్యక్తం చేసింది. విద్యార్థుల మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఐదుగురిలో ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని పేరు నిషా భూపేష్ సోనావానే అని పేర్కొంది. తాము రష్యాలోని భారత రాయబార కార్యాలయాన్ని, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్సులర్ జనరల్‌ను సంప్రదించామని మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.