iDreamPost
android-app
ios-app

ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి!

  • Published Feb 06, 2024 | 3:12 PM Updated Updated Feb 06, 2024 | 3:12 PM

బాణా సంచా ఫ్యాక్టీరీలో భద్రతా చర్యలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

బాణా సంచా ఫ్యాక్టీరీలో భద్రతా చర్యలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి!

ఇటీవల దేశంలో పలు చోట్ల వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ తప్పిదాలు, కరెంట్ షాట్ సర్క్యూట్, బహిరంగ ప్రదేశాల్లో మంటలు వేయడం ఆ నిప్పు రవ్వలో ఇతర ప్రదేశాల్లో పడి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా వ్యాపార సముదాయాలు, బాణసంచా ఫ్యాక్టరీలు, ప్లాస్టీక్ గోదాములు, కెమికల్ ఫ్యాక్టరీలు, టింబర్ ఫ్యాక్టీరీల్లో ఫైర్ సేఫ్టీ తప్పకుండా ఉండాలి. కానీ కొంతమంది నిర్లక్ష్యం వల్ల అవి అందుబాటులో లేక అగ్ని ప్రమాదాలు జరిగినపుడు సరైన రక్షణ కల్పించలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా బాణాసంచ ఫ్యాక్టీరీలో భారీ పెలుల్లు సంభవించడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురి ప్రాణాలు పోగా..60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని హర్ధా పట్టణంలోని ఒక బాణాసంచా ఫ్యాక్టీరీలో జరిగింది. ఫ్యాక్టీరీలో హఠాత్తుగా పేలుడు సంభవించడంతో మంటలు వేగంగా వ్యాపించి చుట్టూ ఉన్న ఇండ్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు పోయాయి. 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి మంటలు అతి కష్టం మీద ఆర్పివేశారు. ఈ ఫ్యాక్టీరీలో ఆవరణలో పలువురు చిక్కుకుపోయి ఉంటారని వారిని కాపాడే పనిలో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. చుట్టుపక్కల ప్రజలు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

ఈ ఘటన గురించి తెలిసిన మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ ఘటనపై తక్షణమే అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ ద్వారా స్థలాన్ని సందర్శించాలని మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, డీజీపీ అరవింద్ కుమార్ లను ఆదేశించారు. మరోవైపు రెస్క్యూటీమ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వంద ఇళ్ల వరకు అధికారులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి వాహనలు, కొన్ని ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.