P Krishna
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది సెలబ్రెటీలు, రాజకీయ నేతలు చేస్తున్న కాంట్రవర్సీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది సెలబ్రెటీలు, రాజకీయ నేతలు చేస్తున్న కాంట్రవర్సీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
P Krishna
సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఒకవేళ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, కాంట్రవర్సీ వీడియోలు ఏవైనా సరే ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఇక దేశంలో ఇసుక మాఫియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇసుక మాఫియా రాజకీయ అండతో రెచ్చిపోతున్నారు. తమకు అడ్డు వచ్చిన గ్రామస్థులను, పోలీసులను సైతం చంపేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ని ఆపినందుకు పోలీస్ అధికారిని చంపేశారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బీహార్ లోని జాముయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న విషయం తెలుసుకొని అడ్డుకోవడానికి వచ్చిన పోలీస్ సబ్‌ఇన్స్‌పెక్టర్ ని దారుణంగా తొక్కించి చంపేశారు. ఈ ఘటనలో హూంగార్డు కూడా తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ దారుణ ఘటన జముయ్ లోని మహూలియా తాండ్ గ్రామంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఎస్సై ప్రభాత్ రంజన్ గా గుర్తించారు. ప్రస్తుతం గర్హి పోలీస్ స్టేషన్ లో ఇన్ చార్జిగా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ తరలించినా ఎస్‌ఐ ని బతికించలేకపోయారు.
ఈ దారుణ ఘటనపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు, తరుచూ జరుగుతూనే ఉన్నాయి. గతంలో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జరిగాయి అని అన్నారు. ఏది ఏమైనా ఈ ఘటనకు పాల్పపడిన నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని అన్నారు. చనిపోయిన పోలీస్ అధికారి ప్రభాత్ రంజన్ కి నాలుగేళ్ల కుమార్తె, ఆరు నెలల కుమారుడు ఉన్నారు. ఆయన కుటుంబం మొత్తం ఢిల్లీలో ఉంటుంది. ఈ ఘటనలో గాయపడిన హూంగార్డును రాజేష్ కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పపడిన మిథిలేష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నారని.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.