iDreamPost
android-app
ios-app

పిల్లని ఇచ్చిన అత్తతో.. అల్లుడు పెళ్లి! మామ దగ్గర ఉండి మరీ పెళ్లి చేశాడు!

  • Published Apr 29, 2024 | 4:02 PM Updated Updated Apr 29, 2024 | 4:02 PM

కూతురు లేదని చేరదీశాడు పిల్లనిచ్చిన మామ. చివరకు తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు అల్లుడు. అత్తతో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు. వీరి బంధంపై అనుమానం ఏర్పడింది మామకు. నిఘా పెంచాడు. ఓ రోజు..

కూతురు లేదని చేరదీశాడు పిల్లనిచ్చిన మామ. చివరకు తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు అల్లుడు. అత్తతో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు. వీరి బంధంపై అనుమానం ఏర్పడింది మామకు. నిఘా పెంచాడు. ఓ రోజు..

  • Published Apr 29, 2024 | 4:02 PMUpdated Apr 29, 2024 | 4:02 PM
పిల్లని ఇచ్చిన అత్తతో.. అల్లుడు పెళ్లి! మామ దగ్గర ఉండి మరీ పెళ్లి చేశాడు!

రాను రాను కొన్ని బంధాలు ఘోరంగా మారుతున్నాయి. అత్త-అల్లుడు, కోడలు-మామ, వదిన-మరిది చెప్పుకుంటూ పోతే ఇలాంటి రిలేషన్స్ అక్రమ మార్గాన్ని అన్వేషిస్తున్నాయి. జీవిత భాగస్వామిని మోసం చేస్తూ వివాహేతర, అక్రమ సంబంధాలను నెరుపుతున్నారు కొందరు. బయట వ్యక్తులతో కాదు.. ఇంట్లోని మనుషులతోనే క్రామ కీడల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన అత్తతోనే శారీరక సంబంధం పెట్టుకున్నాడు అల్లుడు. ఈ విషయం మామకి తెలిసింది. ఎట్లాగైనా వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నాడు. కాపు కాచి..పట్టుకుని ఈ సమస్యను పెద్దల సమక్షంలోకి తీసుకెళ్లాడు. చివరకు అత్తకు మొగుడయ్యాడు అల్లుడు.

వినడానికి కాస్త గగుర్పాడుకు గురౌతున్న ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంకా జిల్లాలోని చత్రపాల్ పంచాయతీ హీర్ మోతీగావ్‌లో దిలేశ్వర్ ధర్వే, గీతా దేవీ భార్యా భర్తలు నివసిస్తున్నారు. వీరికి కుమార్తె ఉండగా.. సికిందర్ యాదవ్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే.. సికిందర్ భార్య చనిపోవడంతో అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అత్త, అల్లుడు ఒకరికొకరు దగ్గరయ్యారు. శారీరకంగా ఒక్కటయ్యారు. వీరి బంధంపై అనుమానం ఏర్పడింది దిలేశ్వర్‌కు. వీరిద్దరిపై నిఘా పెట్టడం స్టార్ట్ చేశాడు. అలా వీరిద్దరిన్నీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు గీతాదేవీ భర్త. ఈ విషయాన్ని పంచాయతీ పెద్దల వద్దకు తీసుకెళ్లాడు.

పంచాయతీ పెద్దల ముందు సికిందర్ యాదవ్.. అత్తతో తనకున్న అక్రమ సంబంధం గురించి చెప్పాడు. ఆమెతోనే ఉంటానంటూ చెప్పడంతో.. గీతాదేవిని వివాహం చేసుకోవాలని చెప్పారు పెద్దలు. ఇందుకు గీతా దేవి భర్త దిలేశ్వర్ కూడా అంగీకరించడం గమనార్హం. గ్రామస్థుల ఆమోదంతో ఆమె నుదిటిన సింధూరం దిద్దాడు సికిందర్. అలా అత్తకు ఇప్పుడు రెండో భర్తగా మారాడు అల్లుడు. ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఇక పోతే భార్యను అల్లుడికి దానం చేసిన మామ దిలేశ్వర్..వీరి పెళ్లిని అధికారికంగా రిజిస్టర్ చేయించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశాడు. అత్తను పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అలాగే నైతిక విలువలపై పెదవి విరిచేలా చేస్తున్నాయి. అమ్మ తర్వాత ఆ పాత్ర పోషించే అత్తతో అల్లుడు రొమాన్స్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio