iDreamPost
android-app
ios-app

ఇదేం విడ్డూరం.. భర్తను వదిలేసి మరీ కోడలిని పెళ్లి చేసుకున్న అత్త..

  • Published Aug 13, 2024 | 9:48 AM Updated Updated Aug 13, 2024 | 9:48 AM

Bihar-Same Gender Marriage: కోడలి మీద మనసు పారేసుకున్న ఓ అత్త.. భర్తను వదిలేసి వచ్చి మరీ.. ఆమెను వివాహం చేసుకుంది. ఆ వివరాలు..

Bihar-Same Gender Marriage: కోడలి మీద మనసు పారేసుకున్న ఓ అత్త.. భర్తను వదిలేసి వచ్చి మరీ.. ఆమెను వివాహం చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Aug 13, 2024 | 9:48 AMUpdated Aug 13, 2024 | 9:48 AM
ఇదేం విడ్డూరం.. భర్తను వదిలేసి మరీ కోడలిని పెళ్లి చేసుకున్న అత్త..

పెళ్లి అంటే ఆడామగా మధ్య జరిగే తంతు. అయితే గత కొద్ది కాలంగా వివాహ వ్యవస్థలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వలింగ వివాహాలు పెరుగుతున్నాయి. సమాజంలో వీటికి ఆమోదం లేకపోయినా సరే.. కొందరు మాత్రం ధైర్యం చేసి మరీ ఇలాంటి బంధంలోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా ఇదే తరహాకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కోడలిపై మనసు పారేసుకున్న అత్త.. ఆమెని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా భర్తను వదిలేసి మరీ వచ్చింది. ఆ తర్వాత కోడలిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి వార్త, ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాలు..

ఈ వింత ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. గోపాల్‌గంజ్‌లోని కుచాయికోట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామానికి చెందిన మహిళకు అప్పటికే వివాహం అయ్యింది. భర్తతో కలిసి కాపురం చేసుకుంటుంది. అంతా సజావుగా సాగుతుందని భావిస్తుండగా.. అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్త తన మేనకోడలిపై మనసు పడింది. ఈ విషయాన్ని ఆమెకు కూడా చెప్పింది. ఇక గత మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. వారు ఈ అత్తాకోడళ్ల ప్రేమను అంగీకరించలేదు. కానీ ఎలాగైనా సరే.. కలిసి జీవించాలని భావించిన అత్తాకోడళ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Married aunt's daughter-in-law

ఈ నేపథ్యంలోనే తాజాగా కోడలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. ఇక ఆ అత్త కూడా భర్తను, కుటుంబాన్ని వదిలేసి మేనకోడలి కోసం వచ్చేసింది. వీరిద్దరు కుటుంబ సభ్యులు, బంధువులను కాదని ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. ససముసాలోని దుర్గా భవానీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న అత్తా కోడళ్లు.. వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య మేనకోడలి మెడలో అత్త తాళి కట్టేసింది. ఆ తర్వాత అగ్ని గుండం చుట్టూ ఏడడుగులు వేశారు. పెళ్లి బంధంలోకి ప్రవేశించారు.

ప్రాణాలు పోయే వరకు తాము ఇద్దరం కలిసే ఉంటామని కొత్త జంట ప్రమాణం చేశారు. ఇక ఈ అత్తాకోడళ్ల పెళ్లికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఈ అత్తా, మేనకోడలి పెళ్లిని స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రస్తుతం తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet