iDreamPost
android-app
ios-app

రాముడు అయోధ్యలో మాత్రమే ఉన్నారా? శివాజీ కామెంట్స్ వైరల్!

  • Published Jan 18, 2024 | 9:45 PM Updated Updated Jan 18, 2024 | 9:45 PM

Sivaji Comments On Ram Mandir: వెండితెర పై నటుడిగా కొనసాగి పలు సినిమాలలో నటించిన నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనే విషయాల గురించి స్పందిస్తూ ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్న శివాజీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఏకంగా అయోధ్య రామ మందిరాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Sivaji Comments On Ram Mandir: వెండితెర పై నటుడిగా కొనసాగి పలు సినిమాలలో నటించిన నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనే విషయాల గురించి స్పందిస్తూ ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్న శివాజీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఏకంగా అయోధ్య రామ మందిరాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • Published Jan 18, 2024 | 9:45 PMUpdated Jan 18, 2024 | 9:45 PM
రాముడు అయోధ్యలో మాత్రమే ఉన్నారా? శివాజీ కామెంట్స్ వైరల్!

జనవరి 22వ తేదీ అయోధ్య రామ మందిరంలో రామయ్య తండ్రి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు కల అయిన ఈ బృహత్తర కార్యక్రమానికి ఏర్పాట్లకు అన్ని పూర్తి అయ్యాయి.  ఈ వేడుకను చూసేందుకు ఎంతోమంది అతిరథ మహారథుల హాజరు కాబోతున్నారు. అలానే ఈ అయోధ్య నిర్మాణంపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం రామ మందిరం అనేది తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా అయోధ్య రామమందిరపై బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నటుడు, బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్ శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాందించారు. అలానే పలు సినిమాల్లో వివిధ కీలక పాత్రల్లో నటించి..ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సినిమాలతో పాటు తరచూ రాజకీయలపై శివాజీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్-7లో పాల్గొన్ని టాప్ -5లో నిలిచారు. ఇక హౌస్ లో శివాజీ చేసిన రచ్చ మామలుగా లేదు. అక్కడ కూడా తనదైన శైలితో బుల్లితెర ఆడియన్స్ వద్ద మార్క్ లు సంపాందించారు.

తనదైన మాటలతో ఫైర్ బ్రాండ్ గా శివాజీ గుర్తింపు పొందారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా జనాలకు కావాల్సినంత కంటెంట్ ను శివాజీ ఇస్తున్నాడు. తాజాగా అయోధ్య రామమందిరంపై శివాజీ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ రాజకీయాలను విమర్శించే క్రమంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతోన్నాయి. శివాజీ మాట్లాడుతూ..అయోధ్యలో ఉన్నదే రామ మందిరమా మా గ్రామాల్లో కూడా రాముల వారి గుడి ఉందని తెలిపారు. అసలు భారతీయ జీవన విధానమే రామ తత్త్వమని, ఈ రాజకీయ పార్టీలు తమ అవసరాలు, అవకాశాల కోసం ఇలాంటి విషయాలు వాడుకుంటాయని విమర్శించారు.

ఇక మనుషుల కంటే ప్రకృతి చాలా గొప్పదని శివాజీ అన్నారు. మనుషులు చేసే తప్పులను ప్రకృతి సరిదిద్దుతుందని శివాజీ పేర్కొన్నారు. మానవుల వల్ల చేతకాని  మార్పును ప్రకృతి తీసుకువస్తుందని తెలిపారు. కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడి చచ్చారని, అయితే కరోనా కంటే దారుణమైనవి వస్తాయని, ఎందుకంటే మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోయిందని, ధనమే ప్రధానం అనుకుంటున్నారని, దేవుడే వచ్చి అన్ని బ్యాలెన్స్ చేసి పోతుంటారని వ్యాఖ్యానించారు. ఇలా అయోధ్య రామ మందిరం గురించి శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి.. అయోధ్య రామ మందిరం విషయంలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet