iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: వయనాడ్‌లో భూమి నుంచి భారీ శబ్ధాలు.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు!

  • Published Aug 09, 2024 | 1:58 PM Updated Updated Aug 09, 2024 | 1:58 PM

Wayanad: ఇప్పుడిప్పుడే వయానాడ్ జిల్లాలోని భయంకరమైన విపత్తు నుంచి కోలుకుంటున్న ప్రజలకు మళ్లీ భయందోళనకు గురి చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Wayanad: ఇప్పుడిప్పుడే వయానాడ్ జిల్లాలోని భయంకరమైన విపత్తు నుంచి కోలుకుంటున్న ప్రజలకు మళ్లీ భయందోళనకు గురి చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Aug 09, 2024 | 1:58 PMUpdated Aug 09, 2024 | 1:58 PM
బిగ్ బ్రేకింగ్: వయనాడ్‌లో భూమి నుంచి భారీ శబ్ధాలు.. భయంతో ఇళ్ల నుంచి జనం  పరుగులు!

గత కొన్ని రోజుల క్రితం కేరళలోని ప్రకృతి కన్నెర్ర చేయడంతో.. ఎంతటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని భారీ వర్షాలు, వరదలు కారణంగా వయనాడ్ జిల్లాలోని కొండచరియలు విరిగిపడటంతో.. చూట్టు ప్రక్కల గ్రామాలన్ని అతలాకుతలమైయ్యాయి. అంతేకాకుండా.. ఈ ఘటన వలన సుమారు 300 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.ఇక మరి కొంతమంది ఆచూకీ కూడా గల్లంతైంది. దీంతో ఆ జిల్లలోని గల్లంతైన వారి కోసం ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ, నావి, ఫారెస్ట్, పోలీసులు దళాలు భారీగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు.

కానీ, గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఇకపోతే ఈ వరద వల్ల అనష్టపోయిన వాయనాడ్ బాధితులకు మరో పక్క సినీ పరిశ్రమ నుంచి  భారీ విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే ఆ భయంకరమైన విపత్తు నుంచి వయానాడ్ ప్రజలు కోలుకుంటుండగా.. మళ్లీ వయానాడ్ లోని తాజాగా భయంకరమైన సంఘటనలు ప్రజలను వణికించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

వయానాడ్ ప్రజలు ఇప్పుడిప్పుడే వరద తీవ్రతల నుంచి కోలుకుంటున్న క్రమంలో.. తాజాగా ఆ ప్రాంతంలోని ప్రజలకు భయందోళనకు గురి చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని జల ప్రళయానికి భారీగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈరోజు  (ఆగస్టు 9వ తేదీన) భూమి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. అయితే ఆ శబ్ధాలు అనేవి సుమారు 11 గంటల సమయంలో.. మెప్పాడి, అనప్పర, తాజాతువాయల్, వినంగోడు, నెన్మేని, వైత్తిరి ప్రాంతాల్లో వచ్చాయి. అంతేకాకుండా.. ఆయా ప్రాంతాలద్లో పలుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయి.  దీంతో భూమి నుంచి భారీ శబ్ధాలు, పలుసార్లు ప్రకంపనలు రావటంతో.. ఆయా ప్రాంతాల్లోని జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అలాగే భూకంపం వచ్చే అవకాశం ఉందని అధికారులు సూచనలతో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. ఇక ఆ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక విషయం తెలిసిన కేరళ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అధికారుల బృందాలను వయనాడ్ ప్రాంతాలకు పంపించింది. కాగా, ఈ అధికారుల బృందంలో జియాలజిస్టులు కూడా ఉన్నారు. పైగా  ప్రకంపనలు వచ్చిన ప్రాంతాలను ఆ అధికారులు పరిశీలిస్తున్నారు. మరీ, ఏదీ ఏమైనా మొన్న మొన్నటి వరకు భయంకరమైన విపత్తును ఎదుర్కొన్న కేరళ రాష్ట్ర ప్రజలకు మళ్లీ భయపెట్టేలా ప్రకంపనలు, భూమి నుంచి భారీ శబ్ధాలు రావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.