iDreamPost
android-app
ios-app

అలర్ట్.. ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్.. ఎన్నిరోజులంటే?

  • Published Aug 29, 2024 | 1:11 PM Updated Updated Aug 29, 2024 | 1:11 PM

Passport Services: ప్రపంచలో ఎవరైనా సరే ఇతర దేశాలకు వెళ్లాలంటే తప్పని సరిగా వారికి సంబంధించి పాస్ పోర్ట్ తప్పని సరి. పాస్ పోర్ట్ ఆన్ లైన్-ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించబడింది.

Passport Services: ప్రపంచలో ఎవరైనా సరే ఇతర దేశాలకు వెళ్లాలంటే తప్పని సరిగా వారికి సంబంధించి పాస్ పోర్ట్ తప్పని సరి. పాస్ పోర్ట్ ఆన్ లైన్-ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించబడింది.

అలర్ట్.. ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్.. ఎన్నిరోజులంటే?

ప్రపంచంలో  ఎవరైనా సరే ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నారంటే వారికి సంబంధించిన వివరాలతో కూడిన పాస్ పోర్ట్ తప్పనిసరి.  పాస్ పోర్ట్ లేకుండా ఇతర దేశాలక పోవడం అసాధ్యం. పాస్ట్ పోర్ట్ ద్వారా ఆ వ్యక్తి ఎవరు? పేరు, గుర్తింపు, నేషనాలిటీ తదితర విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.  పాస్ పోర్టు అనేది అంత సులభంగా రాదు.. దాని కోసం అన్ని రకాల ఎంక్వేయిరీలు జరిపిన తర్వాత మంజూరు చేస్తుంటారు.  పాస్ పోర్టు సేవా కేంద్రంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించబడింది. పాస్ పోర్ట్ అధికారులు దరఖాస్తు చేసుకున్న వారికి కీలక అప్డెట్ అందించారు. వివరాల్లోకి వెళితే..

పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకున్న వారికి కీలక సమాచారం. పాస్ పోర్ట్ సేవా పోర్టల్ నిర్వహణకు సంబంధించిన కార్యాకలాపాల వల్ల పాస్ పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పాస్ పోర్ట్ సేవలు మూడు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు పాస్ పోర్ట్ సేవా సమితి ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీ షెడ్యూల్ చేయనున్నట్లు వివరించింది. రీ షెడ్యూల్ చేసిన వివరాలు ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా గురువారం రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్ట్ సేవలు బంద్ అవుతాయని అధికారులు తెలిపారు.

కొత్త పాస్ పార్ట్ కోసం సెప్టెంబర్ 2 వరకు కొత్త అపాయింట్ మెంట్స్ బుక్ చేసుకోవడానికి వీలు లేదని తెలిపారు. సాధారణంగా కొత్త పాస్ పోర్ట్ తీసుకోవడానికి, పాత పాస్ పోర్ట్ రెన్యూవల్ తదితర సేవలు పొందేందుకు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవడానికి వీలుగా ఆన్ లైన్ సేవా పోర్టల్ ప్రారంభించారు. పాస్ పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీగా ఉంటూ తమ సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే పని పూర్తి చేసుకునేలా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అపాయింట్ మెంట్ బుక్ చేసుకుని నేరుగా సమాయానికి వెళ్లవొచ్చు. టెక్నికల్ ఇబ్బందుల నేపథ్యంలో పాస్ పోర్ట్ సంబంధిత సర్వీసులను మరింత మెరుగు పరిచేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.