iDreamPost
android-app
ios-app

అర్ధరాత్రి బైక్ పై పాడుపని! పోలీసుల అదుపులో ఆటగాడు!

కొందరు యువత తాము పబ్లిక్ ప్రదేశంలో ఉన్నామనే కనీస జ్ఞానం లేకుండా.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మెట్రో రైళ్లలో, బైక్ లపై రొమాన్సులు చేస్తూ.. తమ అంత పోటుగాళ్లులేరన్నట్లు ప్రవర్తిస్తున్నారు. చివరకు జైలు పాలవుతున్నారు.

కొందరు యువత తాము పబ్లిక్ ప్రదేశంలో ఉన్నామనే కనీస జ్ఞానం లేకుండా.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మెట్రో రైళ్లలో, బైక్ లపై రొమాన్సులు చేస్తూ.. తమ అంత పోటుగాళ్లులేరన్నట్లు ప్రవర్తిస్తున్నారు. చివరకు జైలు పాలవుతున్నారు.

అర్ధరాత్రి బైక్ పై  పాడుపని!  పోలీసుల అదుపులో ఆటగాడు!

నేటికాలంలో కొందరు యువత దారుణంగా తయారయ్యారు. తల్లిదండ్రులకు చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తూ.. అందరిలో పరువు తీస్తున్నారు. ముఖ్యంగా కొందరు యువత అయితే తాము పబ్లిక్ ప్రదేశంలో ఉన్నాము అనే కనీస జ్ఞానం లేకుండా.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మెట్రో రైళ్లలో, బైక్ లపై రొమాన్సులు చేస్తూ.. తమ అంత పోటుగాళ్లులేరన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈకోవలో చేరిన యువతి యువకులకు పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా బెంగళూరులు ఇలా బైక్ పై రెచ్చిపోయిన కామ పక్షకులకు పోలీసులు అదిరిపోయే ట్రీట్మెంట్ ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బెంగళూరులో ఓ వ్యక్తి తన ఒడిలో ఓ యువతిని పెట్టుకుని ప్రమాదకరంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నాడు. ఆ యువతి కూడా బైకర్ ఒడిలో ఒకవైపు కూర్చొని, అతని మెడ చుట్టూ చేతులు పట్టుకుని కూర్చుంది. నార్త్ బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన మే 17న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెటింట్లో తెగ వైరల్‌ అయింది. అది కాస్తా బెంగళూరు నగర పోలీసుల వద్దకు చేరింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి.. పట్టుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలాకు ఆ పోటుగాడితో సహా ఆ మహిళను కూడా పోలీసులు గుర్తించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు బైక్ నంబర్ ప్లేట్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ వ్యక్తి, మహిళను గుర్తించారు.

ఆ బైక్ ను నడిపిన వ్యక్తి బెంగళూరులోని శ్యాంపూరా ప్రాంతానికి చెందిన సిలంబర్సన్ (21)గా పోలీసులు గుర్తించారు. ఇక ఈ వ్యక్తి గతంలో ఇలాంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డారా అనే విషయాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.  బైక్ ను స్వాధీనం చేసుకున్న బెంగుళూరు పోలీసులు నిందితుడిపై చర్యలకు ఉపక్రమించారు. రోడ్డు నిబంధనలు అతిక్రమణ కింద వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. ఇంకా పోలీసులు చేసిన పనిని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం ఆ వ్యక్తిపైనే కాకుండా ఆ మహిళపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను కోరారు.  మొత్తంగా పోలీసులు అరెస్టు చేయకముందు, చేసిన తరువాత ఆ వ్యక్తి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.