iDreamPost
android-app
ios-app

నీటి సమస్యతో బెంగుళూరు ఖాళీ! భారీగా తగ్గిన ఇంటి అద్దెలు!

  • Published Apr 17, 2024 | 8:57 PM Updated Updated Apr 17, 2024 | 8:57 PM

Bangalore is Empty Due to Water Problem: ఎండకాలం వచ్చిందంటే దేశ వ్యాప్తంగా నీటి సమస్యలు మొదలైతాయి. భూగర్భ జలాలు ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Bangalore is Empty Due to Water Problem: ఎండకాలం వచ్చిందంటే దేశ వ్యాప్తంగా నీటి సమస్యలు మొదలైతాయి. భూగర్భ జలాలు ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

నీటి సమస్యతో బెంగుళూరు ఖాళీ! భారీగా తగ్గిన ఇంటి అద్దెలు!

సాధారణంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది సర్వసాధారణం. మంచినీటి కోసం సామాన్య జనాలు ఎన్నో కష్టాలు పడుతుంటారు. స్థానికులు నీటి కష్టాలు పడుతుంటే.. కొంతమంది మాత్రం వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. బెంగుళూరులో సామాన్యులే కాదు ధనికులు కూడా నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితికి వచ్చింది. దీంతో కొంతమంది ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ యజమానులు అడ్డగోలుగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. నీటి ఎద్దడి తట్టుకోలేక చాలా మంది తమ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు. మరికొంత మంది ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఉదయం లేచిన మొదలు పడుకునే వరుకు నీటి ఉపయోగం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మంచినీళ్లు లేకుంటే మనిషి మనుగడ చాలా కష్టం.  గత కొన్ని రోజులుగా బెంగుళూరులో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత ప్రభావం బెంగుళూరు లో అద్దె ఇళ్లపై పడిందని అంటున్నారు. బెంగుళూరు అద్దెలు ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతం అయిన వైట్ ఫీల్డ్ లో ఇప్పుడు జనాలు నీళ్లతో యుద్దం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి హైరేంజ్ అపార్టుమెంట్స్ కొని నీళ్ల కోసం రోడ్డెక్కే పరిస్తితి ఏర్పడిందని వాపోతున్నారు. గత మూడు నెలలుగా బెంగుళూరులో నీటి కష్టాలతో ఐటీ కారిడార్ వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఒక్కో కుటుంబం కేవలం నీళ్ల కోసమే ఆరు వేల నుంచి పది వేల వరకు ఖర్చుచేస్తుందట. అపార్ట్‌మెంట్ వాసులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తుండటంతో ఒక్కొక్క ఫ్యామిలీ అదనంగా ఆరువేలకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో ఫ్యామిలీ మెయింటెనెన్స్ పెరిగిపోవడంతో చాలా మంది అద్దెకు ఉన్న వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారట.

Bangalore is empty due to water problem

రెండు నెలల వ్యవధిలోనే బెంగుళూరు సిటీ వైట్ ఫీల్డ్ లో ఇళ్లు ఖాళీ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో అద్దెలు భారీగా తగ్గిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఏరియాలో 15 నుంచి 20 శాతం వరకు అద్దెలు తగ్గించారట యజమానులు. బెంగుళూరు‌లో నీటి ఎద్దడి లేని సమయంలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దె రూ.27 వేల నుంచి రూ.35 వేల రూపాయల వరకు ఉండేది. కానీ ఇప్పుడు రూ.20 వేలకే అద్దెకు ఇస్తామని యజమానులు చెబుతున్నారట.  20 వేల రెంట్.. ఆరు వేలు నీటి ఖర్చు అవుతుంది. అయినా కూడా అద్దె కోసం ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు ఇంటి యజమానులు. ఈ ఏరియాల్లో ఖాళీ చేసి చాలా మంది జనాలు బెంగుళూరు సిటీ శివార్లకు వెళ్లిపోతున్నారట. ఒకప్పుడు వైట్ ఫీల్డ్ లో ఇల్లు అంటే హాట్ కేక్ లా ఉండేవి.. పోటీపడి మరీ అద్దెకు తీసుకునేవారట. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారైనట్లు స్థానికులు చెబుతున్నారు. నీటి ఎద్దడి ఇలాగే ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని ఆంటున్నారు ఇంటి యజమానులు.