P Krishna
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా వాహనదారుల సంఖ్య రోజు రోజుకీ పరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటికి ఒక కారు లేదా బైక్ తప్పని సరి అయ్యాయి. దీంతో రోడ్డుపై వాహనాల రద్దీ మరీ ఘోరంగా పెరిగిపోయాయి. అధికారులు ట్రాఫిక్ నియంత్రణ ఎంత కఠినంగా చేపడుతున్నా.. ఎక్కడో అక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతూనే ఉన్నాయి. గత ఐదు రోజులగా బెంగుళూరులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
గత ఐదు రోజులుగా బెంగుళూరులో భారీగా ట్రాఫిక్ జామ్ జరుగూతూ వస్తుంది. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తుంది. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ భారీగా పెరిగిపోతుందని పోలీసులు తెలిపారు. ఈద్ మిలాద్ ఉన్ నబీకి అధికారికంగా సెలవు.. కర్ణాటక- తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై బంద్ కి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా స్కూల్, ఆఫీసులు అన్నీ సెలవు ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు.
ఈ క్రమంలోనే పలు టెక్ కంపెనీలకు శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో నగరంలో ఉన్న చాలా మంది తమ సొంతఊళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ లు అవుతున్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలకు ట్రాఫిక్ పెరిగిపోయిందని వెల్లడించారు. ప్రతిరోజూ రోడ్లపై వాహనాల సంఖ్య సుమారు 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటాయి. కానీ వరుస సెలవులు ఉండటంతో ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని అంటున్నారు. అలాగే ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలు కూడా ఒక కారణం అయి ఉండొచ్చని తెలిపారు.