iDreamPost
android-app
ios-app

Bengaluru: బెంగళూరులో దారుణం.. 50 ముక్కలుగా మహిళ హత్య! పూర్తి స్టోరీ ఇదే!

  • Published Sep 23, 2024 | 4:30 PM Updated Updated Sep 23, 2024 | 4:30 PM

Bengaluru Crime News: శ్రద్ధావాకర్​ హత్య తరహా మరో దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. 50కిపైగా ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. బెంగళూరులో సంచలన సృష్టించిన ఈఘటనకు సంబంధించి పూర్తి స్టోరీ ఇప్పుడు చూద్దాం..

Bengaluru Crime News: శ్రద్ధావాకర్​ హత్య తరహా మరో దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. 50కిపైగా ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. బెంగళూరులో సంచలన సృష్టించిన ఈఘటనకు సంబంధించి పూర్తి స్టోరీ ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 23, 2024 | 4:30 PMUpdated Sep 23, 2024 | 4:30 PM
Bengaluru: బెంగళూరులో దారుణం.. 50 ముక్కలుగా మహిళ హత్య! పూర్తి స్టోరీ ఇదే!

గతేడాది ఢిల్లీలో ఓ దారుణం జరిగిన సంగతి తెలిసింది శ్రద్దావాకర్ అనే యువతిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆమెను ముక్కలు ముక్కలు గా చేసి దారుణంగా చంపేశారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో దేశంలోని ఎంతో మంది మహిళలు తమ రక్షణపై భయాందోళనలువ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్దావాకర్ హత్య తరహా ఘటన ఒకటి కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. 29 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా 50 ముక్కలుగా నరికి చంపేశారు. ఆ తరువాత శరీర భాగాలను ఫ్రిజ్ లో కుక్కేశారు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ హత్య విషయంలో అనేక  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరీ..ఈ క్రైమ్ కు సంబంధించి..పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్ కు చెందిన మహాలక్ష్మి అనే 29 ఏళ్ల మహిళా కుటుంబం మూడు నెలల క్రితమే బెంగళూరు నగరంకి వచ్చింది. వాయలికావల్ పైప్ లైన్ రోడ్డులోని వీరన్న భవన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే ఆమెకు భర్తతో గొడవలు కావడంతో కొంతకాలంగా వేరేగా నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే మహాలక్ష్మి నివాసం ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుంది. తొలుత ఏదైనా పాడైపోయిన కూరగాయల కారణంగా వస్తుందని చుట్టుపక్కల వారు భావించారు. అయితే క్రమేణా ఆ దుర్వాసన భరించలేనంతగా వస్తుంది. దీంతో ఆ విషయాన్ని అపార్టమెంట్ యజమానికి తెలియజేశారు.

ఆయన అక్కడికి చేరుకుని మహాలక్ష్మి ఉండే ఇంటి తాళంను పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ఇక ఇంట్లో రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే దానిని ఓపెన్ చేసి చూసి హతాశులయ్యారు. ఆ ఫ్రిజ్ నిండా మహాలక్ష్మి శరీర భాగాగాలు ముక్కలు ఉన్నాయి. ఆ మహిళ శరీరాన్ని దాదాపు 50 ముక్కలుగా చేసి..ఫ్రిజ్ లో కుక్కారు. వెంటనే అపార్టమెంట్ ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి..కీలక సమాచారం రాబట్టారు.

పశ్చిమ్ బెంగాల్ కి చెందిన మహాలక్ష్మి కి హేమంత్ దాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా వారిద్దరు విడిపోయారు. ఆ తరువాత ఆమె ఒంటరిగా నివాసం ఉంటుంది. వ్యాలికావల్ ప్రాంతంలోని ఓ అపార్టమెంట్ లో సింగిల్ బెడ్ రూమ్ ను అద్దెకు తీసుకుని ఉంటుంది. మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఫ్యాషన్ ఫ్యాక్టరీ, బట్టల దుకాణంలో టీమ్ లీడర్‌గా పనిచేసింది. మహాలక్ష్మిని తరచూ ఒక యువకుడు కలుస్తుండే వాడని స్థానికులు చెబుతున్నారు. అలానే ఆమెను ఉదయం తీసుకెళ్లి, సాయంత్రం ఇంటివద్ద వదిలి వెళ్లేవాడని చెబుతున్నారు. ఆ యువకుడే హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. 4, 5 రోజుల కింద ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.  ఇక శరీరం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఫ్రీజ్ లో కుక్కినట్లు పోలీసులు భావిస్తున్నానారు.

ఇక ఘటనపై అపార్టుమెంట్ ఓనర్.. మహాలక్ష్మి తల్లికి సమాచారం ఇచ్చారు. హత్య విషయం తెలుసుకున్న మహాలక్ష్మి భర్త హేమంత్ సైతం అక్కడికి చేరుకున్నారు. పోలీసులు హేమంత్‌ను, మహాలక్ష్మి తల్లిని విడిగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. మహాలక్ష్మి ఫోన్ సెప్టెంబర్ 10 నుంచి స్విచ్ఛాఫ్ వస్తోందని ఆమె తల్లి తెలిపారు. మృతురాలికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. మొత్తంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు అక్రమ సంబంధాలు కారణమా? లేక ఆర్థికపరమైన అంశాలున్నాయా? అని పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన బెంగళూరు నగరంలో సంచలనంగా మారింది.  మహిళను చంపి 50 ముక్కలు చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş