iDreamPost
android-app
ios-app

బ్రాహ్మణులు కొత్త యూదులా? బెంగళూరు సీఈఓ అనురాధ తివారీ పోస్ట్ వైరల్

  • Published Aug 26, 2024 | 5:13 PM Updated Updated Aug 26, 2024 | 6:25 PM

Bengaluru CEO Anuradha Tiwari, End Hatred On Brahmins Said Bengaluru Based CEO Anuradha Tiwari: ఒకప్పుడు బ్రాహ్మణులు చిన్న కులాల పట్ల వివక్ష చూపించారని.. ఇప్పటికీ తమని విలన్లుగా చూస్తున్నారని చాలా మంది బ్రాహ్మణులు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక బ్రాహ్మిన్స్ వర్సెస్ నాన్ బ్రాహ్మిన్స్ వర్గాల మధ్య వైరం పెరిగిపోయింది. అయితే తాజాగా ఓ యువతి బ్రాహ్మణులకు మద్దతుగా సంచలన పోస్ట్ షేర్ చేసింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

Bengaluru CEO Anuradha Tiwari, End Hatred On Brahmins Said Bengaluru Based CEO Anuradha Tiwari: ఒకప్పుడు బ్రాహ్మణులు చిన్న కులాల పట్ల వివక్ష చూపించారని.. ఇప్పటికీ తమని విలన్లుగా చూస్తున్నారని చాలా మంది బ్రాహ్మణులు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక బ్రాహ్మిన్స్ వర్సెస్ నాన్ బ్రాహ్మిన్స్ వర్గాల మధ్య వైరం పెరిగిపోయింది. అయితే తాజాగా ఓ యువతి బ్రాహ్మణులకు మద్దతుగా సంచలన పోస్ట్ షేర్ చేసింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

బ్రాహ్మణులు కొత్త యూదులా? బెంగళూరు సీఈఓ అనురాధ తివారీ పోస్ట్ వైరల్

గతంలో బ్రాహ్మణులు చిన్న కులాల వారిని అణచివేతకు గురి చేశారని ఇప్పటికీ అనేక మంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఈ అణచివేతలు లేకపోయినా గానీ ఇంకా బ్రాహ్మణులను కొంతమంది ద్వేషిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీని వల్ల చాలా మంది బ్రాహ్మణులు తమ పూర్వీకుల చేసిన తప్పులకు సిగ్గుపడుతున్నామని.. ఒక రకమైన అభద్రతా భవంలోకి వెళ్ళిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక బ్రాహ్మణుల మీద ద్వేషపూరిత వ్యాఖ్యలు ఎక్కువైపోయాయి. బ్రాహ్మణులం అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బెంగళూరుకి చెందిన ఓ కంపెనీ సీఈఓ ఎక్స్ వేదికగా బ్రాహ్మణులకు మద్దతుగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు అనురాధ తివారీ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. రిజర్వేషన్ సిస్టంని ఎత్తివేయాలని పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే పలుమార్లు అన్నారు. దీనిపై చాలా మంది వ్యతిరేకతను తీసుకొచ్చారు. అయితే రిజర్వేషన్ సిస్టం వల్ల అగ్ర కులాలకు చెందిన పేదవాళ్ళు అన్యాయమైపోతున్నారని.. ముఖ్యంగా బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలు వచ్చాయి. ఈ క్రమంలో అనురాధ తివారీ ఒక వీడియోని షేర్ చేసి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. రిజర్వేషన్ సిస్టం మీద ఆన్ లైన్ వాడి వేడి చర్చ నడుస్తున్న క్రమంలో ఈమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఆదివారం నాడు ఒక పోస్ట్ పెట్టారు.

ఇవాళ బ్రాహ్మణులు తమ పూర్తి పేరు చెప్పుకోవడానికి బాధపడుతున్నారని.. మా మీద విపరీతమైన ద్వేషం చిమ్ముతున్నారని ఆమె అన్నారు. సోషల్ జస్టిస్ యాక్టివిస్ట్ లు, రాజకీయ నాయకులు బ్రాహ్మణులను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరికీ హాని చేయమని, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం లభించదని.. కష్టపడి పని చేస్తామని.. అలాంటి మేము ఎందుకు బ్రాహ్మణ కులం చెప్పుకోవడానికి సిగ్గు పడాలి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో పలువురు సపోర్ట్ గా నిలవగా.. మరి కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. రిజర్వేషన్ సిస్టంకి బ్రాహ్మణులు వ్యతిరేకమని, వారు యూదులని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై ఆమె స్పందించారు.

‘బ్రాహ్మణులు భారత దేశం యొక్క కొత్త యూదులా? అణచివేతదారులుగా బ్రాహ్మణులను తప్పుగా చిత్రీకరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. దీని వల్ల మనం బ్రాహ్మణులం అని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి తలెత్తింది. బ్రాహ్మణులపై తప్పుడు కథనాలను వ్యాపింపజేసే అజెండా కలిగిన వారికి నా సందేశం ఇదే. నేను అనురాధ తివారీ. నేను బ్రాహ్మణురాలిని అని గర్వంగా చెప్పుకుంటున్నా. నేను అణచివేతకు గురి చేసే దాన్ని కాదు. ఇప్పుడే బ్రాహ్మణులపై ద్వేషాన్ని విడిచిపెట్టండి. బ్రాహ్మణ జన్యువులు’ అంటూ ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్ ట్రెండింగ్ అవుతోంది. ఆగస్టు 22న అనురాధ తివారీ ‘బ్రాహ్మణ జీన్స్’ అంటూ పెట్టిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది.

రిజర్వేషన్ అంశం మీద చర్చ నడుస్తున్న క్రమంలో ఈమె పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఒక చేతిలో కొబ్బరి బొండం పట్టుకుని.. మజిల్స్ ని చూపిస్తూ ఒక ఫోటోని షేర్ చేయడంతో వైరల్ గా మారింది. కులం, రిజర్వేషన్ అంశం మీద సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తున్న క్రమంలో ఈమెను వ్యతిరేకించేవారు ఎక్కువైపోయారు. ఈ క్రమంలోనే ఆమె బ్రాహ్మణురాలిని అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీలవుతున్నా అని మరొక ట్వీట్ చేసి వీడియోని షేర్ చేశారు. ఈ ట్వీట్ పెట్టిన కొన్ని నిమిషాల తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రిజర్వేషన్ పై చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. కులం ఆధారంగా హిందువులను విభజించే రిజర్వేషన్ సిస్టంకి ముగింపు పలకాలని అనురాధ తివారీ ట్వీట్ చేశారు.