iDreamPost
android-app
ios-app

చిల్లర పైసలతో ఐ ఫోన్ కొన్న బిచ్చగాడు!.. వైరలవుతోన్న వీడియో

  • Published Oct 10, 2023 | 4:43 PM Updated Updated Oct 10, 2023 | 4:43 PM
  • Published Oct 10, 2023 | 4:43 PMUpdated Oct 10, 2023 | 4:43 PM
చిల్లర పైసలతో ఐ ఫోన్ కొన్న బిచ్చగాడు!.. వైరలవుతోన్న వీడియో

యూత్ లో ఐ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. ఐ ఫోన్ ను ఎలాగైన, ఎంత ఖర్చైనా కొనుక్కోవాలని భావిస్తుంటారు. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉన్న ఐ ఫోన్ అందరినీ ఆకర్షిస్తుంటుంది. అయితే ఇది కామన్ పీపుల్ కొనుక్కోవాలంటే కాస్త ఆలోచించి చేయాల్సిన పనే. ఎందుకంటే అంతటి ఖరీదైన ఐ ఫోన్ ను దక్కించుకోవాలంటే వారికి వచ్చేటువంటి చాలీ చాలని జీతాలు, ఆర్థిక పరిస్థితులు సామాన్యులను ఐ ఫోన్ వంక చూడకుండా చేస్తాయి. కానీ అక్కడ ఓ బిచ్చగాడు ఏకంగా ఐ ఫోన్ కొనుగోలు చేశాడు. మొత్తం చిల్లర డబ్బులతో ఐ ఫోన్ కొని అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఐ ఫోన్ సిరీస్ లు ఎప్పుడు రిలీజ్ అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. కొత్తగా రిలీజ్ అయిన ఐ ఫోన్లను కొనుక్కునేందుకు కస్టమర్లు ఎగబడడం మనం చూసే ఉంటాం. అయితే జోధ్ పూర్ లో ఓ బిచ్చగాడు షాప్ కు వెళ్లి ఐ ఫోన్ కొన్నాడు. బిచ్చగాడేంటి? ఐ ఫోన్ కొనడమేంటీ అని ఆలోచిస్తున్నారా?.. అయితే ఐ ఫోన్ కొన్న మాట నిజమే..కానీ అది కొనుగోలు చేసింది నిజమైన బిచ్చగాడు కాదు. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు. ‘ఎక్స్‌పెరిమెంట్‌ కింగ్‌’ అనే పేరుతో ప్రయోగాత్మకమైన వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఐ ఫోన్ కొనేందుకు బిచ్చగాడి వేషం వేసుకొని వెళ్తే షాప్ వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ప్రాంక్ చేశాడు.

కాగా బిచ్చగాడి వేషంలో చిల్లర పైసలు పట్టుకుని జోధ్ పూర్ లోని పలు షాపులు తిరిగాడు. అతడి వేషధారణ చూసిన కొందరు షాపు నుంచి బయటకు పంపియ్యగా, మరికొందరు చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు. అలా షాపులన్నీ తిరిగే క్రమంలో ఓ షాపు ఓనర్ బిచ్చగాడి వద్ద చిల్లర తీసుకొని తనకు ఐ ఫోన్‌ ప్రో మ్యాక్స్‌ మోడల్‌ను అందజేశాడు. ఇక ఐ ఫోన్ కొనడం పూర్తయిన తరువాత బిచ్చగాడి వేశంలో ఉన్న అతడు తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదో ప్రాంక్‌ అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం షాప్ యజమాని వంతైంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.

 

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom