nagidream
Man Turns Thief For Girl Friend: ప్రేమిస్తే సరిపోదు.. అవతల ఉన్న వాడు ఎలాంటి వాడు అనేది కూడా అమ్మాయిలు స్కాన్ చేయాలి. తెచ్చే బహుమతులను చూస్తారు గానీ వాటిని ఎక్కడ నుంచి తీసుకొస్తారో మాత్రం తెలుసుకోరు. తెలుసుకోకపోతే ఇదిగో ఇలా ఏ దొంగ వెధవకో మనసిచ్చి చెత్త కుప్పల దగ్గర వెతుక్కునే పరిస్థితి వస్తుంది.
Man Turns Thief For Girl Friend: ప్రేమిస్తే సరిపోదు.. అవతల ఉన్న వాడు ఎలాంటి వాడు అనేది కూడా అమ్మాయిలు స్కాన్ చేయాలి. తెచ్చే బహుమతులను చూస్తారు గానీ వాటిని ఎక్కడ నుంచి తీసుకొస్తారో మాత్రం తెలుసుకోరు. తెలుసుకోకపోతే ఇదిగో ఇలా ఏ దొంగ వెధవకో మనసిచ్చి చెత్త కుప్పల దగ్గర వెతుక్కునే పరిస్థితి వస్తుంది.
nagidream
ప్రేమ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఒక్కొక్కరి ప్రేమ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ప్రేమిస్తే.. కొంతమంది మాత్రం డబ్బుతో ఆ ప్రేమను కొనేస్తుంటారు. ప్రస్తుతం ప్రేమలన్నీ డబ్బుతో ముడిపడినవే. ప్రేమిస్తే నాకేంటి అనేలానే ఉన్నారు నేటి యువత. ప్రేమించడం ప్రతి ఒక్కరూ చేస్తారు.. కానీ బహుమతులు ఇచ్చేవాడికే ఒక రేంజ్ ఉంటుందని అంటారు. అందుకే ప్రేమించిన అమ్మాయి కోసం అప్పో, సొప్పో చేసి ఆ డబ్బుతో ఖరీదైన బహుమతులు కొంటారు. వేదం సినిమాలో కేబుల్ రాజు క్యారెక్టర్ చూసే ఉంటారు.
ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి న్యూ ఇయర్ పార్టీకి పిలిచిందని హోటల్ లో ఎంట్రీ పాస్ లు కొనేందుకు డబ్బులు లేకపోతే దొంగతనం చేయడానికి కూడా వెనుకాడడు. ఆ తర్వాత కేబుల్ రాజు తన తప్పు తెలుసుకుని ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి హీరో అవుతాడు. కానీ నిజ జీవితంలో ఈ వ్యక్తి మాత్రం జీరో అయ్యాడు. ప్రియురాలి కోసం దొంగగా మారాడు. ప్రేమించిన అమ్మాయికి ఖరీదైన బహుమతులు, లగ్జరీ వస్తువులు ఇవ్వడం కోసం.. లవర్ తో కలిసి ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్ చేయడానికి దొంగతనాలు చేయడం మొదలెట్టాడీ బ్యాంక్ ఉద్యోగి. ఎంసీఏ చదివిన కుమార్ చెన్నైలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్ కి నెలకు 30 వేల రూపాయలు జీతం వస్తుంది. ఇతనికి ఒక లవర్ ఉంది.
తన లవర్ కి గిఫ్టులు కొనేందుకు తన జీతం సరిపోవడం లేదని.. దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. టి నగర్ లోని శరవణ ఎలైట్ స్టోర్ లో ఒక బంగారు ఉంగరం చోరీ చేశాడు. ఉస్మాన్ రోడ్ లోని శరవణ ఎలైట్ స్టోర్స్ లో మరో దొంగతనం చేశాడు. అయితే షాప్ సిబ్బంది కుమార్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో దొంగతనం చేసిన డబ్బులతో తన లవర్ కి బహుమతులు కొని ఇచ్చేవాడినని కుమార్ తెలిపాడు. క్రోమ్ పేట, పల్లవరం, టి నగర్ వంటి ఏరియాల్లో చాలా షాప్స్ లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా పలు లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేదని విచారణలో తేలింది. లగ్జరీ లైఫ్ కోసం ఇలా చేసినట్లు తెలిపాడు. కుమార్ ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించారు.