Bangalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ తోపాటు పట్టుబడ్డ సినీ ప్రముఖులు!

బెంగళూరులో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్ తోపాటు పట్టుబడ్డ సినీ ప్రముఖులు!

Bangalore Rave Party: ఇటీవల కొంతమంది యువత పుట్టిన రోజు పార్టీల పేరుతో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నిసార్లు రేవ్ పార్టీల్లో సెలబ్రెటీలు పాల్గొంటూ పోలీసులకు దొరికిపోతున్నారు.

Bangalore Rave Party: ఇటీవల కొంతమంది యువత పుట్టిన రోజు పార్టీల పేరుతో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ డ్రగ్స్ తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నిసార్లు రేవ్ పార్టీల్లో సెలబ్రెటీలు పాల్గొంటూ పోలీసులకు దొరికిపోతున్నారు.

ఈ మధ్య వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ మెంట్ కోసం ఎగబడుతున్నారు యూత్. పబ్, రీసార్ట్స్ లో పార్టీలు చేసుకుంటూ చిల్ అవుతున్నారు. కొంతమంది రహస్య ప్రదేశాల్లో రెయిన్ పార్టీలు, రేవ్ పార్టీ చేసుకుంటూ మత్తులో మునిగితేలుతున్నారు. రేవ్ పార్టీలు జరుగుతున్న సమాచారం తెలుసుకొని పోలీసులు రైడ్ చేయడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలాంటి పార్టీల్లో సామాన్యులే కాదు.. కొన్నిసార్లు సెలబ్రెటీలు కూడా దొరికిపోతున్నారు. రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్, మద్యం తీసుకుంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో సినీ తారులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు లో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్ హౌజ్ లో పుట్టిన రోజు పేరుతో రేవ్ పార్టీ జరిగింది. హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డి అన వ్యక్తికి చెందిన జీఆర్ ఫౌమ్ హౌజ్ లో భారీ ఎత్త రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ రేవ్ పార్టీ ఆదివారం జరిగింది.. 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేసి ఈ పార్టీ చేసుకున్నట్లు సమాచారం. ఈ పార్టీ కోసం ఏపీ, తెలంగాణ నుంచి విమానాల్లో వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల్లో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బెంగుళూరులో రేవ్ పార్టీలో జల్సా చేస్తూ 100 మంది వరకు పట్టుబడ్డట్టు తెలుస్తుంది. వీరిలో 25 మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్ సెలబ్రెటీలు, టెకీలు, మోడల్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తి తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ పెద్ద ఎత్తున బెంగుళూరులోని శివారు ప్రాంతంలో ఉన్న జీఆర్ ఫాం హౌజ్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ లో ఏపీ కి సంబంధించిన మంత్రి కాకాణి గోవర్థన్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు దర్శనమిచ్చింది.అయితే ఆ కారు తనది కాదని కానాణి వివరణ ఇచ్చారు. మరోవైపు సినీ నటుల గురించి కూడా వార్తలు వస్తున్నాయి.. తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

Show comments