Venkateswarlu
Venkateswarlu
సాధారణంగా ట్రాఫిక్ కారణంగా వాహనాదారులకు ఇబ్బందులు తలెత్తటం సహజం. అత్యవసర పరిస్థితిలో కూడా గంటలు, గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాదు! ట్రాఫిక్ కారణంగా మానసికంగా.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనుషుల గురించి పక్కన పెడితే.. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఐటీ సంస్థలు కూడా ఏటా వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నాయి. ఒక్క బెంగళూరు నగరంలోనే ప్రతీ ఏటా ఏకంగా 19,725 కోట్ల నష్టాలు వస్తున్నాయి.
ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వ సలహాదారుడు శ్రీహరి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఓ నివేదిక అందించారు. ఆ నివేదికలో ట్రాఫిక్ జామ్‌లను అదిగమించేందుకు పాటించాల్సిన విధానాలు వివరించారు. అంతకు క్రితం.. ఆగస్టు 3వ తేదీన శ్రీహరి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా బెంగళూరులో నెలకొంటున్న ఇబ్బందుల్ని ఆయనకు వివరించారు. ట్రాఫిక్ కారణంగా ప్రతీ ఏటా బెంగళూరులోని ఏటీ హబ్ 19,725 కోట్ల రూపాయలు నష్టపోతోందని తెలిపారు.
సిటీలో దాదాపు 60 ఫ్లై ఓవర్లు ఉన్నప్పటికీ ట్రాఫిక్ విషయంలో అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయన్నారు. బెంగళూరులో 14.5 మిలియన్ల జనం నివసిస్తున్నారని, 1.5 కోట్ల వాహనాలు ఉన్నాయని వెల్లడించారు. శ్రీహరి వివరణ విన్న కేంద్ర మంత్రి.. బెంగళూరులో ఏర్పడ్డ ట్రాఫిక్ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావటానికి ఏం చేయాలన్న దానిపై ఓ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. మరి, ట్రాఫిక్ కారణంగా బెంగళూరులోని ఐటీ రంగం ప్రతీ ఏటా 19,725 కోట్ల రూపాయలు నష్టపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.