iDreamPost
android-app
ios-app

26 వేళ్లతో పుట్టిన చిన్నారి.. దేవత అవతారం అంటున్న కుటుంబం!

26 వేళ్లతో పుట్టిన చిన్నారి.. దేవత అవతారం అంటున్న కుటుంబం!

సాధారణంగా ఉండాల్సిన వాటి కంటే ఎక్కువ అవయవాలతో శిశువులు జన్మించటం జరుగుతూ ఉంటుంది. జెనటిక్స్‌ సమస్యల కారణంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా, రాజస్తాన్‌ రాష్ట్రంలో ఓ చిన్నారి ఏకంగా 26 చేతి, కాలి వేళ్లతో పుట్టింది. ఆ పాప అలా పుట్టడంతో కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. తమ ఇంట్లో దేవత పుట్టిందని ఆ కుటుంబం అంటోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌కు చెందిన ఓ జంట కొద్దిరోజుల క్రితం ఓ ఆడ పిల్లకు జన్మనిచ్చింది.

ఆ ఆడపిల్ల అత్యంత అరుదైన జెనటికల్‌ డిజార్డర్‌తో జన్మించింది. పాపకు సాధారణంగా ఉండాల్సిన చేతి వేళ్లు, కాలి వేళ్ల కంటే ఎక్కువ ఉన్నాయి. చేతులకు పది వేళ్లు ఉండాల్సిన స్థానంలో 14 వేళ్లు.. 12 కాలి వేళ్లు ఉన్నాయి. ఇదో అరుదైన జెనటికల్‌ డిజార్డర్‌ అని డాక్టర్లు చెబుతున్నా.. కుటుంబం మాత్రం దీన్నో అద్భుతంగా భావిస్తోంది. తమ ఇంటి దైవం అయిన దేవత తమ ఇంట్లో ఆడ పిల్లగా జన్మించిందని, ఆ పిల్ల ధోలా ఘర్‌ దేవి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.