Dharani
సాధారణంగా జాతీయ పండుగలు, ఎన్నికల వేళ, గణేష్ చతుర్థి సందర్భంగా వైన్ షాపులు మూసి వేస్తారు. ఇక తాజాగా జనవరి 2న మద్యం దుకాణాలు ముసి వేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ వివరాలు..
సాధారణంగా జాతీయ పండుగలు, ఎన్నికల వేళ, గణేష్ చతుర్థి సందర్భంగా వైన్ షాపులు మూసి వేస్తారు. ఇక తాజాగా జనవరి 2న మద్యం దుకాణాలు ముసి వేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ వివరాలు..
Dharani
సాధారణంగా.. మన దేశంలో జాతీయ సెలవు దినాలు, పండుగల వేళ, ఎన్నికల సమయం, రిజల్ట్ వేళ మద్యం దుకాణాలు బందు చేస్తారు. మద్యం మత్తులో గొడవలు చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుగానే డ్రై డేగా డిక్లేర్ చేస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది జనవరి 22న తేదీన.. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. జనవరి 22 నేషనల్ హాలీడే కూడా కాదు.. మరి డ్రై డేగా ఎందుకు డిక్లేర్ చేశారనే డౌట్ వస్తుందా.. అయితే ఇది చదవండి.
జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. ఎందుకు అంటే.. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే. ఈకార్యక్రమానికి సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రభుత్వం శరవేగంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 22 వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో డ్రై డే అమలవుతుందని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రకటించారు. అంటే ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మద్యం విక్రయాలు జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా రాష్ట్రంలో డిసెంబర్ 25 వ తేదీ నుంచి జనవరి 2 వ తేదీ వరకు నిర్వహించిన గుడ్ గవర్నెన్స్ వీక్ చివరి రోజున సీఎం విష్ణు దేవ్ సాయ్ ఈ ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో సుపరిపాలన వారోత్సవాలు జరుపుకుంటున్నామని సీఎం తెలిపారు. సుపరిపాలనే తమ సంకల్పం అని, రామరాజ్య స్థాపనే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రంలోని వరి ఉత్పత్తి సంస్థల ద్వారా సుమారు 3 వేల టన్నుల బియ్యాన్ని పంపించినట్లు ప్రకటించారు. అంతేకాక రాష్ట్రంలో పండిన కూరగాయలను కూడా అయోధ్యకు తరలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అయోధ్యలో దివ్యమైన రామమందిరంలో జనవరి 22 వ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.దీని కోసం ఇప్పటికే గర్భగుడిలో ప్రతిష్ఠాపని చేయనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోజు డ్రై డే పాటించాలని సీఎం విష్ణు దేవ్ సాయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రజలు భవ్య రామ మందిర నిర్మాణానికి తమ వంతు సాయాన్ని అందజేస్తున్నారు. అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను అయోధ్యకు పంపిస్తున్నారు. ఇక రాముని తల్లి కౌసల్య సొంత ఊరిగా భావించే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి భారీగా బియ్యం ట్రక్కులు అయోధ్యకు బయల్దేరాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు.