P Krishna
Ram Lallas Idol Costume Tailors: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాలరాముడి ప్రతిరూపం చూసి భక్తులు తరించిపోయారు.
Ram Lallas Idol Costume Tailors: నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాలరాముడి ప్రతిరూపం చూసి భక్తులు తరించిపోయారు.
P Krishna
నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత నేడు అయోధ్యలో కన్నుల పండువగా జరిగిన మహోత్సవానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తరలి వచ్చారు. వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, కోట్ల సంఖ్యలో పరోక్షంగా ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. అభిజిత్ లగ్నం లో రాం లాలా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సోమవారం 12.30 నుంచి 1 గంటల వరకు సాగింది. బాల రాముడి దివ్యమంగల స్వరూపం చూసి భక్తులు పులకించిపోతున్నారు. బాల రాముడు వేసుకున్న వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని ఇంత అందంగా డిజైన్ చేసిన వారు ఎవరో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఇప్పుడు దేశమంతా ఎక్కడ చూసినా అయోధ్య రామమందిరంలో కొలువైన బాల రాముడికి గురించిన మాటలే మాట్లాడుకుంటున్నారు. స్వామి వారి దివ్య మంగళ స్వరూపం ఎంత చూసినా తనివి తీరడం లేదని భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. రాం లల్లా ధరించిన వస్త్రాలపై చర్చలు నడుస్తున్నాయి. అయోధ్యలో ఓ చిన్న టైలర్ షాపు నడుపుకునే బాబూ లాల్ టైలర్స్ ఈ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. బాబూ లాల్ టైలర్స్ అంటే ఇద్దరు అన్నదమ్ములు.. భగవత్, శంకర్ లాల్. మూడు దశాబ్దాలు క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్, శంకర్ ల తండ్రి బాబూలాల్ కి అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామి వారికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. రాముని విగ్రహానికి ఒక్కోరోజు ఒక్కోరంగుతో కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసి కుడుతుంటారు.
అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం బాబూ లాల్ టైలర్స్. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు భగవత్, శంకర్ లాల్ నడుపుతున్నారు. వీళ్లే బాల రామయ్యకు వేసే బట్టలను అందంగా డిజైన్ చేస్తారు. నేడు రామ మందిర్ లో ప్రాణ ప్రతిష్ట చేసిన రాం లల్లాకు కాస్ట్యూమ్స్ డిజేన్ చేసింది వీరే. మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్‌దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్, శంకర్‌ల తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు కుడుతోంది. రాముని విగ్రహానికి ఒక్కోరోజు ఒక్కోరంగుతో కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేసి కుడతారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం రంగు వస్త్రాలను డిజైన్ చేస్తుంటారు. రాముడికి మాత్రమే కాదు.. లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమాన్, శాలీగ్రామాలకు బట్టలు కుడుతుంటారు. ఇద్దరు అన్నదమ్ములు రామ్ లల్లా కోసం దుస్తులు అద్భుతమైన డిజైన్ తో చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా రాం లల్లాకు వస్త్రాలు డిజైన్ చేసే భాగ్యం కలిగినందుకు తమ జన్మ ధన్యం అయ్యిందని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.