nagidream
Auto Drivers New Scam: అన్ని రకాల మనుషుల్లో మంచోళ్ళు ఉన్నట్టే చెడ్డోళ్లు కూడా ఉంటారు. అలానే ఆటో డ్రైవర్లలో కూడా మంచిరకం, నాశిరకం ఇద్దరూ ఉంటారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల్ని మోసం చేయడంలో నయా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.
Auto Drivers New Scam: అన్ని రకాల మనుషుల్లో మంచోళ్ళు ఉన్నట్టే చెడ్డోళ్లు కూడా ఉంటారు. అలానే ఆటో డ్రైవర్లలో కూడా మంచిరకం, నాశిరకం ఇద్దరూ ఉంటారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల్ని మోసం చేయడంలో నయా ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.
nagidream
మంచి, చెడు అన్ని చోట్లా ఉంటాయి. ఆటో డ్రైవర్లలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎవరైనా పొరపాటున ఆటోలో బ్యాగ్ లేదా ఇతర వస్తువులు ఏమైనా మర్చిపోతే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి మరీ తిరిగి ఇస్తారు. ఆ సమయంలో ఫ్యూయెల్ అయిపోతుందని అస్సలు ఆలోచించరు. బ్యాగు అవీ తిరిగి ఇచ్చినందుకు డబ్బులు కూడా అడగరు. కానీ కొంతమంది ఆటోడ్రైవర్ల తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా అని ఫోన్ ఆటోడ్రైవర్ కిస్తే సర్రన ఫోన్ ఎత్తుకెళ్లిపోయేవాళ్లు ఉన్నారు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఆటోడ్రైవర్లు మాత్రం అడ్వాన్స్డ్ లెవల్.
కస్టమర్లు ఎవరైనా ఆటో ఎక్కితే మంచిగా మాట్లాడతాడు. ఇట్టే కలిసిపోతాడు. బానే మాట్లాడుతున్నాడు కదా అని అదే పనిగా వింటే మాయ చేసి డబ్బులు కాజేస్తాడు. దీన్ని ఎమోషనల్ స్కామ్ అంటున్నారు. పర్సులు కొట్టేయకుండా కాకుండా సెంటిమెంట్ తో డబ్బులు కొట్టేస్తున్నారు. ఒక వ్యక్తి ఇటీవల బెంగళూరులోని ఒక షేర్ ఆటో ఎక్కారు. ఆటోలో కూర్చున్న తర్వాత ఆటోడ్రైవర్ ఒక్కసారిగా బోరున ఏడుస్తున్నాడు. ఏమైందని అడిగితే.. ‘సార్ నా భార్య హాస్పిటల్ లో ఉంది.. చికిత్సకు నా దగ్గర డబ్బులు లేవు. నా భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళని పెంచడానికి మా దగ్గర స్థోమత లేదు. ఈ డబ్బులు లేకనే మా అమ్మ హాస్పిటల్ లో చనిపోయింది’ అంటూ ఆటో డ్రైవర్ ఎమోషనల్ డ్రామా ప్లే చేశాడు.
అదంతా నిజమని నమ్మిన ఆ వ్యక్తి అతనికి డబ్బులు సహాయం చేశారు. అయితే ఆ తర్వాత వేరే ఆటో ఎక్కగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇలా నాలుగు సార్లు.. నలుగురు ఆటోడ్రైవర్లతో జరిగిందని.. వీళ్ళు ఎమోషన్స్ ని వాడుకుని స్కామ్ చేస్తున్నారని ఆ వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళ వల్ల అవసరం ఉన్న జెన్యూన్ ఆటో డ్రైవర్స్ కి సాయం అందదు అని వెల్లడించారు. అయితే ఈ స్కామ్ చేసే ఆటో డ్రైవర్లంతా ఒకే కథను ప్యాసింజర్లకి చెప్తున్నారని ఒక యూజర్ కామెంట్ చేశారు. మొత్తానికి ఒక సింపథీ, సెంటిమెంట్ క్రియేట్ చేసి ఆటో ఎక్కిన ప్యాసింజర్ల నుంచి డబ్బులు కాజేయడం ఇప్పుడొక ట్రెండ్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి కట్టు కథలపై అప్రమత్తంగా ఉంటే మంచిది.