iDreamPost
android-app
ios-app

స్టార్‌ హోటల్‌లో కుక్క బర్త్‌డే.. ఖరీదైన విందు, రిటర్న్‌ గిఫ్ట్‌లు కూడా

  • Published Feb 21, 2024 | 8:38 PM Updated Updated Feb 21, 2024 | 8:38 PM

ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరు తమ పెంపుడు శునకాలను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తన పెంపుడు శునకం గురించి చాలా వినూత్నంగా ఆలోచన చేసింది. దీంతో ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరు తమ పెంపుడు శునకాలను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకుంటున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తన పెంపుడు శునకం గురించి చాలా వినూత్నంగా ఆలోచన చేసింది. దీంతో ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

  • Published Feb 21, 2024 | 8:38 PMUpdated Feb 21, 2024 | 8:38 PM
స్టార్‌ హోటల్‌లో కుక్క బర్త్‌డే.. ఖరీదైన విందు, రిటర్న్‌ గిఫ్ట్‌లు కూడా

ప్రస్తుత కాలంలో పెంపుడు జంతువులను పెంచుకోని వారు, ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అందులో మనుషులకు అత్యంత విశ్వసమైన జంతువు శునకం. చాలామంది ఇళ్లలో మనుషులకన్నా, పెంపుడు శునకాలకే ఎక్కువ విలువను ఇస్తున్నారు. అలాగే వాటిని తమ సొంత పిల్లల మాదిరిగా సాకుతుంటారు. అవి కొంచెం అనారోగ్యంకి గురైనా కంటికి రెప్పలా చూసుకోవడం, వాటికి ఆహారం తినిపించడం వంటివి చేస్తుంటారు. అలాగే అవి కనిపించకుండా పోతే తల్లడిల్లిపోతూ.. వాటి ఆచుకి కోసం భారీ మొత్తంలో నగదు కూడా ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా, ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు శునకం గురించి స్టార్ హోటల్ లో చేసే పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరిగిందంటే..

ఈ మధ్యకాలంలో చాలామంది తమ పెంపుడు శునకాలను కుటుంబ సభ్యలు కంటే అత్యంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అవి తప్పిపోతే ప్రకటనలు ఇవ్వడం, మరణిస్తే.. మనుషులకు చేసినట్లు కర్మకండాలు వంటివి చేయడం తరుచు చూస్తున్నాం. అయితే, తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి చెందిన ఆకాంక్ష రాయ్‌ అనే మహిళ మాత్రం.. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నా తన పెంపుడు శునకం ‘హ్యాండ్సమ్‌’ గురించి కొంచెం వినూత్నంగా ఆలోచించి వార్తల్లో నిలిచింది. తన పెంపుడు శునకం హ్యాండ్సమ్ కోసం ఏకంగా లగ్జరీ స్టార్ హోటల్‌ని బుక్ చేసింది. కాగా, అందులో శునకానికి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించారు. అంతేకాకుండా, ఆ వేడుకలకు అతిథులుగా 30కి పైగా శునకాలు హాజరుకాగా.. వాటికి రిటర్న్ గిఫ్ట్‌లుగా పెట్ ఫుడ్ అందజేశారు. అయితే, మూడేళ్ల వయసున్న ఈ శునకం అంటే ఆకాంక్షతో పాటు కుటుంబసభ్యులు అందరికి ఎంతో ఇష్టం.

అయితే గోల్డెన్‌ రిట్రీవర్‌ బ్రీడ్‌కు చెందిన తన శునకం ‘హ్యాండ్సమ్‌’పుట్టినరోజు సందర్భంగా.. స్టార్ హోటల్‌లో పార్టీని ఏర్పాటు చేయడమే కాకుండా.. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనితో పాటు ఇండోర్‌లోని ప్రముఖ ఖజ్రానా గణేశ్‌ ఆలయానికి తీసుకెళ్లి పూజలు జరిపించారు. అనంతరం హ్యాండ్సమ్‌ను, డాగ్‌ పార్లర్‌కు తీసుకెళ్లి.. ప్రత్యేకంగా అలంకరించారు. ఇక తర్వాత నగరంలోని లగ్జరీ హోటల్‌ డైనర్స్ పార్క్‌కు తీసుకువచ్చి, హ్యాండ్సమ్‌తో కేక్ కట్‌ చేయించారు.

ఇక అతిథులు సైతం హ్యాండ్సమ్ కోసం పలు గిఫ్ట్‌లు తీసుకొచ్చారు. పైగా హ్యాండ్సమ్‌ పేరు మీద ప్రత్యేకంగా ఓ సోషల్‌ మీడియా ఖాతాను కూడా తెరిచారు. ఈ ఖాతాకు చాలామంది ఫాలోవర్స్‌ ఉండడం విశేషం. అయితే దీనిపై ఆకాంక్ష రాయ్ మాట్లాడుతూ.. తనకు హ్యాండ్సమ్ ఓ బిడ్డ లాంటిది, దానిని విడిచి మేము ఒక్క క్షణం కూడా ఉండాలేమని చెప్పారు. అలాగే తాను ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తానని అన్నారు. అందుకే దాని పుట్టినరోజు కూడా ఇంత ఘనంగా నిర్వహించామని తెలిపారు. మరి, పెంపుడు శునకం పుట్టినరోజు వేడుకలను స్టార్ హోటల్ లో నిర్వహించిన మహిళ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.