Arjun Suravaram
చాలా మందికి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే అది ఒక ఏజ్ వరకే ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. కానీ కొందరికి మాత్రం వృద్ధాప్యం వచ్చిన చదువుపై ఉండే ఆసక్తి తగ్గదు. ఆ ఇష్టంతోనే జీవితం చివరి దశలో కూడా పలు ఘనతలు సాధిస్తుంటారు.
చాలా మందికి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే అది ఒక ఏజ్ వరకే ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. కానీ కొందరికి మాత్రం వృద్ధాప్యం వచ్చిన చదువుపై ఉండే ఆసక్తి తగ్గదు. ఆ ఇష్టంతోనే జీవితం చివరి దశలో కూడా పలు ఘనతలు సాధిస్తుంటారు.
Arjun Suravaram
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. చదువు, ఆటలు, పాటలు, డ్రాయింగ్ వంటి అనేక అంశాలపై ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా చాలా మందికి చదువు అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుంది. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా పలువురు చదువుతూనే ఉంటారు. మరికొందరికి వృద్ధాప్యం వచ్చినా కూడా చదువుపై ఆసక్తి తగ్గదు. అలానే ఎంతో మంది పెద్ద వాళ్లు వివిధ రకాల కోర్సులు చదివి.. అనేక డిగ్రీలు పొందారు. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు డబుల్ పీజీ చేశారు. అది కూడా పదవి విరమణ వయస్సులో ఈ ఘనత సాధించారు. మరి.. ఆ చదువు బిడ్డ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నగంరంలో రాజ్ కరణ్ బారువా అనే 56 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయన నగరంలోనే సెక్యూరిటీ గార్డుగా రూ.5 వేల జీతానికి పనిచేస్తున్నారు. అలా రాత్రంతా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, పగలు ఇళ్లలోనూ పని చేస్తారు. రాజ్ కరుణ్ చేసిన ఈ పనులు చాలా మంది చేస్తూ ఉండొచ్చు. కానీ ఆయన సాధించిన ఓ ఘనతను మాత్రం చాలా తక్కువ మందే సాధిస్తారు. దాదాపు పదవి విరమణ వయసుకు దగ్గరైనా ఆయన డబుల్ పీజీ సాధించారు. రిటైర్మెంటు వయసుకు దగ్గరైనా చదువుపై జిజ్ఞాసను వీడకపోవడం రాజ్‌కరణ్ ప్రత్యేకత. ఆయనకు చిన్నతనం నుంచి చదువు అంటే అమితమైన ఇష్టం.
1996లోనే పురాతత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాంటి ఆయనకు గణితశాస్త్రంలో కూడా ఆ ఘనత సాధించాలనే బలమైన కోరికగా ఉండేది. జీవన పోరాటంలో ఎన్నో పరీక్షలు ఎదురైన మనసులోని ఆకాంక్షను ఏమాత్రం వదిలేయలేదు. ఏళ్లు గడుస్తున్న తన కోరికను మనసులో సజీవంగా ఉంచుకొన్నారు. ఆయన 23 సార్లు విఫల యత్నాల చేసి చివరకు ఇటీవల డబుల్ పీజీ పూర్తి చేశారు. జబల్‌పుర్‌లోని రాణీ దుర్గావతి యూనివర్సీ నుంచి ఈ ఏడాది తన రెండో మాస్టర్ డిగ్రీ ఎమ్మెస్సీలో మ్యాథ్స్ ను రాజ్ కరణ్ సాధించారు.
అయితే తనకు ఈ విజయం అంత సులభంగా రాలేదు. ఈ ఘనత సాధించే ప్రయత్నంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. రాత్రిళ్లు తాను మెట్లపై కూర్చొని చదువుకోవడం చూసి కొంతమంది కటువుగా మాట్లాడేవారని కరణ్ చెప్పుకొచ్చారు. తన రెండో ప్రయత్నంలో ఒక సబ్జెక్టు మినహా మిగతా అన్నింటిలో వరుసగా పరీక్షలు ఫెయిల్ అవుతూ వచ్చానని, చివరకు సాధించానని తెలిపారు. ఏ సదుపాయాలు లేని తానే సాధించినపుడు.. అన్ని సౌకర్యాలు ఉన్న యువత ఎందుకు సాధించలేరని కరణ్ ప్రశ్నించారు. మరి చదువుపై ఆకాశమంత ఇష్టాన్ని చూపించిన ఈ కరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.