iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 2రోజులు అదనంగా సెలవులు

  • Published Jul 12, 2024 | 11:00 AMUpdated Jul 12, 2024 | 11:00 AM

చాలామంది ఉద్యోగులు ఉరుకులు, పరుగులతో బిజీ లైఫ్ ను గడుపుతున్న వేళ తమ కుటుంబాలకు అంతగా సమయం కేటాయించలేక పోతున్నారు. అంతేకాకుండా.. వారిని పూర్తతిగా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పాడుతుంది. అయితే అలాంటి వారి కోసం తాజాగా ఉద్యోగులకు ప్రభుత్వం రెండు రోజులు అదనంగా సెలవులు ఇచ్చింది.

చాలామంది ఉద్యోగులు ఉరుకులు, పరుగులతో బిజీ లైఫ్ ను గడుపుతున్న వేళ తమ కుటుంబాలకు అంతగా సమయం కేటాయించలేక పోతున్నారు. అంతేకాకుండా.. వారిని పూర్తతిగా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పాడుతుంది. అయితే అలాంటి వారి కోసం తాజాగా ఉద్యోగులకు ప్రభుత్వం రెండు రోజులు అదనంగా సెలవులు ఇచ్చింది.

  • Published Jul 12, 2024 | 11:00 AMUpdated Jul 12, 2024 | 11:00 AM
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 2రోజులు అదనంగా సెలవులు

నిత్యం ఉరుకులు, పరుగులతో బిజీ లైఫ్ ను గడుపుతున్న ఉద్యోగులకు ప్రశాంతంగా గడిపే తీరికే ఉండదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఇంట్లో సరదాగ గంట కాదు కదా 10 నిమిషాలు కూడా సమయం కేటాయించే వీలు అసలే దొరకదు. దీంతో నిరంతరం యంత్రంలా కష్టపడుతున్న ఉద్యోగులకు సెలవు రూపంలో ఊరట దొరకలని ఆశ పడుతుంటారు. కానీ, ఆఫీసులో సెలవులు ఎవరికి వారు పెట్టుకునే సెలవులకంటే.. సంస్థ ఇచ్చే సెలవుల కోసం చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే.. ఆ సమయంలో ఎటువంటి వర్క్ టెన్షన్ లేకుండా ప్రశాంతగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చని ఆశ పడతారు.

కానీ, ఉద్యోగులకు సెలవు దినాల అంటే అది వీకాఫ్ కానీ, ఏదైనా జాతీయ సెలవులు, పండుగలు అయి ఉంటే తప్పా పెద్దగా సెలవులు అనేవి దొరకవు. అందుకోసం ప్రతిఒక్క ఉద్యోగులు సెలవులు కోసం ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తుంటారు. మరి, ఇలా ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ప్రశాంతంగా తల్లిదండ్రులు, అత్తామామలతో కలిసి సమయం గడపాలని అనుకుంటున్న వాళ్లకి తాజాగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారి కోసం రెండు రోజులు అదనంగా సెలవులు ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. చాలామంది ఉద్యోగులు పనిలో పడి తమ కుటుంబాలకు అంతగా సమయం కేటాయించలేక.. తల్లిదండ్రులు, అత్తమామలను పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం వాళ్లతో కొంత సమయాన్ని గడిపి వాళ్ల అలానా పాలానా చూసుకోవాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. మరి అలాంటి వారి కోసం తాజాగా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సరదాగా, ప్రశాంతంగా కుటుంబంతో గడిపేందుకు అసోం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) రెండు రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

అయితే ఇక్కడ తల్లిదండ్రులు, అత్తామామలు లేనివారికి ఇది వర్తించవని వ్యక్తిగత సరదాలకు ఈ సెలవులను ఉపయోగించరాదని కండిషన్లు పెట్టింది. ఇకపోతే వృద్ధ్యాపంలోని పెద్దలను గౌరవించడం కోసం వారిపై శ్రద్ధ చూపడం కోసమే ప్రత్యేకంగా అక్కడ ప్రభుత్వం ఉద్యోగులకు 6,8 తేదీల్లో ఈ ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.అయితే నవంబర్‌ 7న ఛట్ పూజ, 9న రెండో శనివారం, 10న ఆదివారం కాగా.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల ప్రత్యేక సెలవులు కలిసిరానున్నాయి. ఇక అత్యవసర విభాగాల్లో ఉన్నవారు మాత్రం ఈ ప్రత్యేక సెలవులను దశలవారీగా ఉపయోగించుకోవచ్చు. అయితే, ఉద్యోగులకు ప్రత్యేక సెలవులపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ మూడేగేళ్ల కిందటే ప్రకటన చేశారు.

ఇక  ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో సరదా గడిపేందుకు.. వారిపై శ్రద్ధ చూపడం కోసం రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తామని 2021 లో హిమాంత బిశ్వశర్మ పేర్కొన్నారు. పైగా ఇలాంటి సెలవులు ఇస్తున్న ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులతో పాటు సామన్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రత్యేక సెలవులను ఉద్యోగులకు ఇవ్వలేదని కొనియాడారు. మరి, తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్న ఉద్యోగులకు అసోం ప్రభుత్వం ఇచ్చిన ఈ సెలవులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి