iDreamPost
android-app
ios-app

అంబానీ కొడుకు పెళ్ళిలో  2500 రకాల వంటకాలతో.. ఒక్కో ప్లేట్ ఖర్చు?

  • Published Feb 27, 2024 | 8:41 PM Updated Updated Feb 27, 2024 | 8:41 PM

Anant Ambani- Radhika Merchant: అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ పెళ్లికి సంబందిచి పలు ఆసక్తిక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Anant Ambani- Radhika Merchant: అనంత్ అంబానీ- రాధికా మర్చెంట్ పెళ్లికి సంబందిచి పలు ఆసక్తిక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

  • Published Feb 27, 2024 | 8:41 PMUpdated Feb 27, 2024 | 8:41 PM
అంబానీ కొడుకు పెళ్ళిలో  2500 రకాల వంటకాలతో.. ఒక్కో ప్లేట్ ఖర్చు?

ముఖేష్ అంబానీ అపర కుబేరుడు మాత్రమే కాదు. కలియుగ కుబేరుడు కూడా. తన వద్ద ఎంత సంపద ఉన్నా.. దాన్ని ఇంకాస్త పెంచడం ఆయనకి ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ఐడియాలతో మార్కెట్ ని షేక్ చేయడం ముఖేశ్ అంబానీకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఇక కొడుకులు, కోడళ్ళు చేతికి అంది వచ్చాక అంబానీ జోరు మరింత పెరిగిపోయింది. ఇండియాలో ఉన్న ప్రతి మనిషి అంబానీకి ఇండైరెక్ట్ గా ఏదో ఒక రూపంలో డబ్బులు చెల్లిస్తున్నాడు అంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి.. ఇంతటి సామ్రాజ్యం సృష్టించిన అంబానీ కొడుకు పెళ్లి అంటే ఎలా ఉంటుంది? ఆకాశం అంత పందిరి, భూదేవి అంత అరుగు అనే సామెతలు కూడా సాధారణ మాటలు అయిపోయే రేంజ్ లో ఆ పెళ్లి ఉంటుంది. దేశంలోని సెలబ్రెటీలు, స్టార్స్, నాయకులు, మీడియా అంతా ఆ పెళ్లి ఇంట వాలిపోవడం ఖాయం.  మరి.. ఇంతమంది హాజరయ్యే వేడుకలో వంటకాలు ఏ రేంజ్ లో ఉంటాయి. ఊహిస్తేనే ఆమ్మో అనిపిస్తుంది కదా? ఆ ఊహకి ఏ మాత్రం తగ్గకుండా వంటకాల విషయంలో పెద్ద ప్లాన్ వేశారట అంబానీ.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి నిజానికి జులై 12వ తేదీన జరగనుంది. అయితే.. మార్చి 1,2,3 తేదీలల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌ తమ జీవితాల్లోకి వస్తున్న ఆనందంలో ముందుగా చేస్తున్న పెళ్లి తంతు ఇది. దీని కోసం అంబానీ 100 కాదు, 200 కాదు.. ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారట. ఇందుకోసం దేశం నలువైపుల నుండి ప్రత్యేకంగా 25 నుండి 30 మంది బెస్ట్ షెఫ్ లను నియమించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో టీమ్ ని అలాట్ చేయనున్నారట.

ఇక ఈ వేడుకలో బ్రేక్ ఫాస్ట్ కోసం 70 రకాల వంటకాలు సిద్ధం చేయిస్తున్నారట. ఇక లంచ్  కోసం 250 రకాలు, నైట్ డిన్నర్ కోసం మరో 250 రకాల వంటలు మెనులో ఉండబోతున్నాయట. మొత్తం 3 రోజుల పాటు సాగే ఈ వేడుకలో ఏ ఒక్క రోజు కూడా.. ఏ ఒక్క వంటకం రిపీట్ కాకుండా ఓవరాల్ మెనూ ఇప్పటికే సిద్ధమైంది అని సమాచారం. ఇక మిడ్-నైట్ స్నాక్స్ కౌంటర్ 3 రోజుల పాటు హైలెట్ గా నిలిచేలా అంబానీ ప్లాన్ చేయించారట. గెస్ట్ లు అంతా ఎక్కువగా నైట్ లైఫ్ కి అలవాటు పడ్డవారు కాబట్టి.. ఆ సమయంలో కూడా బెస్ట్ ఫుడ్ ఉండాలన్నది అంబానీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక  ప్రముఖ వంటకాలతో  మెనూ గట్టిగానే సిద్ధమైనట్టు సమాచారం.

ఇండియన్, ఏషియన్ కాంటినెంటల్, మెడిటేరియన్, స్పానిష్, జపనీస్, చైనీస్ అంటూ ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక ఓవరాల్ గా ఒక్క రోజుకి ఒక మనిషి భోజనం ఖరీదు కనీసం రూ 15 వేలు వరకు అవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి.. ప్రీ వెడ్డింగ్ సంబరాలకే ఇంత ఖర్చు చేస్తున్న అంబానీ.. ఇక పెళ్ళికి ఏ స్థాయిలో ఖర్చు పెడతారో అనే క్యాలిక్యులేషన్స్ ఇప్పటి నుండే మొదలైపోయాయి. మరి.. 2500 రకాల వంటకాలతో నిండిన మెనూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss