iDreamPost
android-app
ios-app

రోగిలా నటిస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రికి IAS ఆఫీసర్! అంతా వణికిపోయారు

  • Published Mar 14, 2024 | 9:08 AM Updated Updated Mar 15, 2024 | 4:35 PM

సినీమాలో చూపించిన మాదిరిగా ఓ ఐఏఎస్ అధికారిణి రోగి రూపంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయాలని వెళ్లగా అక్కడ కనిపించే దృశ్యలను చూసి షాక్ అయిపోయింది.

సినీమాలో చూపించిన మాదిరిగా ఓ ఐఏఎస్ అధికారిణి రోగి రూపంలో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయాలని వెళ్లగా అక్కడ కనిపించే దృశ్యలను చూసి షాక్ అయిపోయింది.

  • Published Mar 14, 2024 | 9:08 AMUpdated Mar 15, 2024 | 4:35 PM
రోగిలా నటిస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రికి IAS ఆఫీసర్! అంతా వణికిపోయారు

ఏదైనా ఒక సినిమాలో ప్రభుత్వ ఆసుపత్రిలకు సంబంధించి ఐఏఎస్ అధికారుల హోదాలో ఉన్న హీరో, హీరోయిన్ లు తనిఖీ చేయడం చూస్తుంటాం. అది కూడా ఒక సాధారణ వ్యక్తుల మాదిరిగా వెళ్లి అక్కడ పరిస్థితులను గమనిస్తారు. అలాగే అధికారులు రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారా..అసలు ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్నా సమస్యలు ఏమిటి వంటివి తెలుసుకుంటారు. అయితే ఇది అంతా సినిమా వరకే పరిమితం అనుకుంటాం. కానీ తాజాగా ఓ ప్రభుత్వ అధికారిణి మాత్రం దానిని నిజం చేసి చూపించింది. అందుకు ఆమె ఓ రోగిలా ముఖం కప్పుకుని ఆస్పత్రికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తూ.. అక్కడ సిబ్బందికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

సహజంగా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే వైఖరి గురించి అందరికీ తెలిసిందే.ఎక్కడ లేని నిర్లక్ష్యం, లంచగొండితనంకు మారుపేరుగా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అసలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే.. ప్రాణాలు మీద ఆశలు వదులుకోవాలనే భయం ప్రజల్లో నెలకొంది.ఇక ఈ విషయం పై ప్రజలు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసిన వాటిని అధికారులు పెడచెవిన పెడుతుంటారు.కానీ, ఓ ఐఏఎస్‌ అధికారిణి మాత్రం.. ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంపై ప్రజలు వరుసగా ఫిర్యాదులు చేయడంతో రహస్యంగా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోని ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆసుపత్రికి వెళ్లి.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో జరిగింది. ఆ వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని దీదా మాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు అందాయి. అందులో ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందులోబాటులో ఉండటం లేదని పలువురు ఫిర్యాదు చేశారు.

IAS officer to the government hospital as a patient!

దీంతో ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ కృతి రాజ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. ఐఏఎస్ అధికారి కృతి రాజ్ బుధవారం (మార్చి 13)న ఓ రోగి మాదిరిగా ముసుగు ధరించి ఆసుపత్రికి వెళ్లి.. అక్కడ డాక్టర్‌ చెకప్‌కు వెళ్లారు. అయితే డాక్టర్‌ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారిణి కృతి గ్రహించారు. అంతేకాకుండా.. అక్కడ ఆసుపత్రి మెడికల్ స్టాక్‌ స్టోర్‌లో చాలా మందులు గడువు ముగిసినవి ఉన్నట్లు గుర్తించారు. అలాగే.. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేయగా రిజిస్టర్‌లో కొందరి సంతకాలు ఉన్నా.. అక్కడ సిబ్బంది లేకపోవడం, విధుల్లో ఉన్న సిబ్బంది సేవలు సరిగా చేయకపోవడం గ్రహించి ఆమె గుర్తించి ఆగ్రహించారు.

ఇక తనిఖీ అనంతరం ఐఏఎస్‌ అధికారిణి కృతి మీడియాతో మాట్లాడుతూ.. కుక్క కాటుకు ఇంజెక్షన్ వేయడానికి ఉదయం 10 గంటల తర్వాత కూడా డాక్టర్ అందుబాటులో లేనట్లు దిదా మాయి ఆరోగ్య కేంద్రానికి సంబంధించి నాకు ఫిర్యాదు అందింది. అందువల్ల నేను ముసుగులో ఆసుపత్రికి వెళ్ళాను. అలా డాక్టర్‌ వద్దకు వెళ్లగా అతని ప్రవర్తన సరిగా లేదు. అంతేకాకుండా.. స్టాక్‌లో ఉన్న చాలా ఔషధాల గడువు ముగిసి ఉన్నాయి.దీంతో పాటు పరిశుభ్రత కూడా సక్రమంగా నిర్వహించట్లేదని’ అన్నారు. అందుచేత ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై త్వరలో నివేదిక పంపుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారిణి కృతి ముఖానికి ముసుగు వేసుకుని, సాధారణ రోగి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వీడియో క్లిప్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి, ఈ రోగిలా ఆసుపత్రికి వెళ్లి తనిఖీలు నిర్వహించిన ప్రభుత్వ అధికారిణి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.