Arjun Suravaram
Ram Temple Theme Necklace: అయోధ్యలో ఆ దశరథ తనయుడు శ్రీరామ చంద్రుడి ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో రామమందిర థీమ్ తో ఉన్న వజ్రాల హారం అందరిని ఆకర్షిస్తోంది.
Ram Temple Theme Necklace: అయోధ్యలో ఆ దశరథ తనయుడు శ్రీరామ చంద్రుడి ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో రామమందిర థీమ్ తో ఉన్న వజ్రాల హారం అందరిని ఆకర్షిస్తోంది.
Arjun Suravaram
దేవుడిపై ఉన్న అపారమైన భక్తి, శ్రద్ధలను.. భక్తులు ప్రతిసారి ఎవరికి తోచిన విధంగా వారు నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇక భారతదేశంలోని కోట్లాది మంది భక్తుల కల నెరవేరబోయే సమయం దగ్గర పడుతోంది. అయోధ్యలో ఆ దశరథ తనయుడు శ్రీరామ చంద్రుడి ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామ మందిరానికి సంబంధించి ఎన్నో వార్తలను మనం తరచూ వింటూనే ఉన్నాము. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే.. తన ప్రమాణ స్వీకారానికి తనతో పాటు.. ఈ రామ మందిర ప్రతిరూపాన్ని తీసుకుని వెళ్లారనే వార్తను చూశాం. తాజాగా సూరత్ లోని ఓ నగల వ్యాపారి రామమందిర ఆకృతి రూపంతో ఏకంగా ఒక వజ్రాల హారాన్ని తయారు చేశారు.
గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి వినూత్నమైన థీమ్ తో ఈ హారాన్ని రూపుదిద్దాడు. ఈ అద్భుతమైన హారాన్ని ఆయన రామమందిరానికి కానుకగా అందచేయనున్నారు. కాగా, ఈ హారాన్ని తయారు చేయడానికి 35 రోజుల సమయం పట్టిందని వారు తెలిపారు. రోజుకు 40 మంది కళాకారులు ఈ నగను రూపొందించేందుకు కష్టపడ్డారు. ఇక అచ్చం రామ మందిర ఆకృతిని పోలి ఉన్న ఈ హారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అయితే, ఈ విషయమై.. రుషేష్ జ్యువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కకాడియా మాట్లాడుతూ.. “ఇందులో ఐదు వేలకు పైగా అమెరికన్ వజ్రాలను ఉపయోగించామని.. ఇది రెండు కిలోల వెండితో తయారు చేయబడిందని అన్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం మాకు స్ఫూర్తినిచ్చిందని.. ఇది ఏ వాణిజ్య ప్రయోజనం కోసం కాదని.. దీనిని రామమందిరానికి కానుకగా అందచేయాలి అనుకుంటున్నామని అన్నారు. అయోధ్య రామమందిరానికి మా తరపున ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే తయారు చేశామని అన్నారు. రామాయణంలోని ప్రధాన పాత్రలు ఈ హారం తీగపై అందంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కాగా, జనవరి 16 నుంచి అయోధ్యలో రామయ్య ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.
జనవరి 22న ఆలయంలో శ్రీరామ చంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో వేడుకల భద్రతా ఏర్పాట్ల గురించి ఐజీ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ కట్టుదిట్టంగా ఉంటాయి. సీఆర్‌పీఎఫ్, యూపీఎస్‌ఎస్‌ఎఫ్, పీఎస్‌ఇ, సివిల్ పోలీసులు నిత్యం పహారా కాస్తోన్నారు. కొత్త భద్రతా ప్రణాళికల ప్రకారం ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తాము. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే నదీతీరం వెంబడి కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం” అని ఆయన తెలియజేశారు.
అంతే కాకుండా, వేడుకల సందర్భంగా 37 పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా, ఆ రామయ్య తన జన్మ భూమిలో కొలువు తీరబోయే సమయం కోసం కొన్ని కోట్ల మంది భక్తులు వేచి ఉన్నారు. ఎవరికి తోచినంతలో వారు శ్రీరామునికి భక్తితో కానుకలు సమర్పించుకుంటున్నారు. మరి, సూరత్ లోని వజ్రాల వ్యాపారి తయారుచేసిన..రామ మందిర ఆకృతి రూపు దాల్చిన వజ్రాల హారంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Surat based diamond merchant made a necklace with theme of Ayodhya Ram Mandir. 40 artisans worked on it for 35 days.
— News Arena India (@NewsArenaIndia) December 18, 2023