iDreamPost
android-app
ios-app

కూతురు సజీవంగా లేకపోయినా.. ఆమెతోనే బ్రతుకుతోన్న తల్లి..!

సృష్టికి మూలం అమ్మ. తల్లే లేకుండా మానవ జాతి లేదు. మనుగడ కూడా లేదు. కానీ ఆ తల్లికి పిల్లలే పంచ ప్రాణాలు. వారు లేకపోతే.. తన జీవితానికి అర్థం, పరమార్థం లేదనుకుంటూ ఉంటుంది. పిల్లల ఆలనా పాలనలో బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటుంది. కానీ ఆ పిల్లలే..

సృష్టికి మూలం అమ్మ. తల్లే లేకుండా మానవ జాతి లేదు. మనుగడ కూడా లేదు. కానీ ఆ తల్లికి పిల్లలే పంచ ప్రాణాలు. వారు లేకపోతే.. తన జీవితానికి అర్థం, పరమార్థం లేదనుకుంటూ ఉంటుంది. పిల్లల ఆలనా పాలనలో బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటుంది. కానీ ఆ పిల్లలే..

కూతురు సజీవంగా లేకపోయినా.. ఆమెతోనే బ్రతుకుతోన్న తల్లి..!

భర్త తర్వాతే కడుపున పుట్టిన బిడ్డలకు ప్రాధాన్యతనిస్తుంది మహిళ. ఇంటిని పోషించడమే కాకుండా.. పిల్లలను ఉన్నత స్థితికి చేర్చేందుకు రేయింబవళ్లు కాయా కష్టం చేసేది భర్తే కాబట్టి..ప్రతి విషయంలో అతడికి అండగా, చేదోడువాదోడుగా నిలుస్తుంది భార్య. అలా అని పిల్లల్ని తక్కువ చేసి చూడదు. తిండి లేని సమయంలో తాను పస్తులున్నా.. బిడ్డల కడుపు మాడ్చదు తల్లి. వారిని కంటికి రెప్పలా కాపుకాస్తుంది. అందుకే తల్లిని మించిన దైవం, యోధులు లేరంటారు. భర్త చనిపోయినా తట్టుకోగలదు కానీ.. తమ కడుపున పుట్టిన బిడ్డలు, తమను సాదుకోవాల్సిన పిల్లలు.. తమ కళ్ల ముందే చనిపోతే తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. అమ్మ కడుపు విలవిలాడుతుంది. ఇదిగో ఈ తల్లి విషయంలో ఇదే జరిగింది.

ఆమె జీవితంతో విధి రెండు సార్లు ఆటలాడింది. భర్తను దూరం చేసినా సహించింది, కానీ కూతుర్ని కూడా ఎత్తుకెళ్లిపోయింది. ఒంటరిగా బతుకున్న ఆమె జీవితంలో మళ్లీ కూతురు వచ్చింది.. ప్రతిమ రూపంలో. ఇప్పుడు ఆ కూతురి ప్రతిమతోనే మిగిలిన జీవితాన్ని గడుపుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని దావరణ గెరె సర్వస్వతి బరంగయ్‌లోని నివాసం ఉంటున్నారు రిటైర్డ్ టీచర్ కమలమ్మ. కూతురు కావ్య పుట్టిన కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోయాడు. కూతురు ఆలనా పాలనా చూడకుండా భర్త మృతి చెందడంతో కన్నీటి పర్యంతమైంది కమలమ్మ. అయినా కూతురికి తండ్రి లేని లోటు తెలియకుండా పెంచాలని నిర్ణయించుకున్న తల్లి.. ఆమెను బీఈ చదివించింది.

ఇక అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే..తాను మనవడు, మనవరాళ్లతో కాలం వెళ్లదీయొచ్చని ఆశపడింది కమలమ్మ. తెలిసిన వాళ్ల ద్వారా తన కుమార్తెకు సంబంధం చూసింది. ఇక రెండు, మూడు నెలల్లో పెళ్లి అనుకోగా..ఇంతలో కుమార్తె కావ్య అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు క్యాన్సర్ అని తేలింది. గుండె పగిలినంత పనైంది. వెంటనే ఆమెకు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు. నాలుగేళ్ల పాటు చికిత్స అందించినప్పటికీ కావ్య మృత్యువుతో పోరాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో కన్నుమూసింది. అయితే తాను చనిపోతానని తెలిసిన కావ్య అమ్మకు జాగ్రత్తలు చెబుతూనే.. కొన్ని కోరికలు తెలిపింది.

చనిపోయే ముందు ఓ విగ్రహానికి సంబంధించిన వీడియోను మొబైల్ లో చూపించి.. ఇలాంటి విగ్రహాన్ని తాను లేనప్పుడు తయారు చేయించమని చెప్పింది. తాను లేకపోయినా.. ఈ విగ్రహం రూపంలో నీ కళ్ల ముందే ఉంటానని చెప్పిందని కమలమ్మ చెబుతున్నారు. అలాగే తాను చనిపోయాక.. సమాధి చేసిన చోట పూల మొక్కలతో గార్డెన్ నిర్మించమని చెప్పిందని పేర్కొన్నారు. తన శరీరంలోని అవయవాలను ఆసుపత్రిలో దానం చేమయని తెలిపిందన్నారు. అయితే కావ్య క్యాన్సర్ తో చనిపోవడం వల్ల.. ఆమె అవయవాలు తీసుకునేందకు సీనియర్ వైద్యులు నిరాకరించినట్లు తల్లి పేర్కొంది. చివరకు ఓ స్థలం కొనుగోలు చేసి.. కావ్య అంత్యక్రియలు అక్కడ పూర్తి చేశామని వెల్లడించింది.

ఇక కావ్య కోరిక మేరకు ఆమె చనిపోయిన కొద్ది రోజులకే విగ్రహాల తయారీదారుడైన విశ్వనాథ్ అనే కళాకారుడిని సంప్రదించి.. మూడున్నర లక్షలు వెచ్చించి.. తన సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించింది తల్లి. ఆ విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకుని కుమార్తె లేని లోటును పోగొట్టుకుంటుంది. అలాగే కావ్య జయంతి రోజున.. అనాథ పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంటారు. చిన్నప్పటి నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్నకావ్య పలు కవితలు రాసింది. వాటిని ఓ పుస్తకం రూపంలో విడుదల చేశారు తల్లి. ఈ తల్లి పట్ల విధి చూపిన వివక్షపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి