iDreamPost
android-app
ios-app

Ajmer Case Verdict: వందకు పైగా అమ్మాయిలపై అత్యాచారం.. కేసులో అజ్మీర్ కోర్టు సంచలన తీర్పు

  • Published Aug 20, 2024 | 6:54 PM Updated Updated Aug 20, 2024 | 7:22 PM

18 People Who Made Atrocities On College Students: దేశంలో ఏదో ఒక చోట అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే అది కేసు.. అదే సామూహిక అత్యాచారం చేస్తే అది సెన్సేషనల్ కేసు.. మరి వందలాది మంది అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేస్తే..? కొన్నేళ్ల పాటు అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలు చేసేది ఒక గ్యాంగ్.

18 People Who Made Atrocities On College Students: దేశంలో ఏదో ఒక చోట అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే అది కేసు.. అదే సామూహిక అత్యాచారం చేస్తే అది సెన్సేషనల్ కేసు.. మరి వందలాది మంది అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేస్తే..? కొన్నేళ్ల పాటు అమ్మాయిలపై సామూహిక అత్యాచారాలు చేసేది ఒక గ్యాంగ్.

Ajmer Case Verdict: వందకు పైగా అమ్మాయిలపై అత్యాచారం.. కేసులో అజ్మీర్ కోర్టు సంచలన తీర్పు

పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో జూనియర్ డాక్టర్ ని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. ఇదిలా ఉంటే కోల్కతా మెడికో కేసుని మించిన కేసు ఒకటి ఉంది. ఒకరిపై కాదు వందకు పైగా అమ్మాయిలపై అత్యాచారం చేశారు. ఇది జరిగి కొన్నేళ్లు అవుతుంది. 32 ఏళ్ల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ కేసుకి సంబంధించి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 

రాజస్థాన్ లోని అజ్మీర్ పట్టణంలో 32 ఏళ్ల క్రితం వందకు పైగా అమ్మాయిలపై కొందరు దుండగులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వందలాది మంది విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేసి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. 1992లో అజ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఫరూక్ చిస్తీ ఉండేవాడు. అతని అనుచరులు ఫరూక్ అండ చూసుకుని కాలేజీ అమ్మాయిల వెంటపడి వేధించేవారు. అమ్మాయిలతో ప్రేమ నటించి నమ్మించి ఫార్మ్ హౌజ్ లకి, రెస్టారెంట్స్ కి తీసుకెళ్లేవారు. మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఆ సమయంలో అమ్మాయిల నగ్న చిత్రాలను, వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసేవారు. బ్లాక్ మెయిల్ చేసి మరోసారి అత్యాచారాలకి పాల్పడేవారు.

నగ్న చిత్రాలు చూపించి మీకు తెలిసిన అమ్మాయిలను తీసుకురావాలని.. లేదంటే ఫోటోలు, వీడియోలు నెట్ లో పెడతామంటూ బెదిరించేవారు. ఇలా వందలాది మంది కాలేజీ అమ్మాయిలను సామూహిక అత్యాచారం చేశారు. ఫరూక్ చిస్తీ గ్యాంగ్ చేతుల్లో ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు. 250 మందికి పైగా అమ్మాయిలు బలైనట్లు వార్తలు వచ్చాయి. వీరిలో ఎక్కువ మంది 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపే ఉన్నారని మైనర్ బాలికలను కూడా వదల్లేదు. గ్యాంగ్ మొత్తం కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. అత్యాచారం చేయడం.. జరిగింది బయటకు చెప్తే నగ్న ఫోటోలు, వీడియోలతో బెదిరించడం వంటి దారుణాలకు పాల్పడుతూ వచ్చేది ఆ గ్యాంగ్. దీంతో చాలా కాలం పాటు వీళ్ళ ఆకృత్యాలు కొనసాగాయి.

1992లో ఈ గ్యాంగ్ చేసిన పాపాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ కేసులో అజ్మీర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఫరూక్ చిస్తీ ఉండగా.. నఫీస్ చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహైల్ ఘనీల్ తో పాటు 18 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందికి శిక్ష పడగా.. మరో ఆరుగురి నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఆరుగురు నిందితులకు జీవితఖైదుతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది అజ్మీర్ ప్రత్యేక కోర్టు. దీంతో ఈ కేసులో 18 మందికి శిక్ష పడినట్లయింది. ఇంకా మిగిలిన ముగ్గురు నిందితుల్లో ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకొకడు పరారీలో ఉండగా.. మరొక నిందితుడిపై ప్రత్యేక విచారణ కొనసాగుతుంది. ఇదే 32 ఏళ్ల క్రితం వెలుగు చూసిన అత్యంత ఘోరమైన కేసు.