iDreamPost
android-app
ios-app

వీడియో:ఎయిర్ ఇండియా విమానంలో మంటలు..ఏం జరిగిందంటే!

  • Published May 19, 2024 | 3:31 PM Updated Updated May 19, 2024 | 3:31 PM

Air India Plane Catches Fire: ఇటీవల దేశంలో విమాన ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. విమానాశ్రయం నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే ప్రమాదాలకు గురైతున్నాయి.

Air India Plane Catches Fire: ఇటీవల దేశంలో విమాన ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. విమానాశ్రయం నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే ప్రమాదాలకు గురైతున్నాయి.

వీడియో:ఎయిర్ ఇండియా విమానంలో మంటలు..ఏం జరిగిందంటే!

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా విమాన ప్రయాణాలు ఎంచుకుంటారు. కానీ ఈ మధ్య తరుచూ విమానా ప్రమాదాలతో ప్రయాణికులు భయపడుతున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఆకాశంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం, పక్షులు ఢీ కొనడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పైలెట్లు ముందుగానే ప్రమాదాన్ని గమనించి సురక్షితంగా ల్యాండింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బెంగుళూర్ విమాన ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులో విమాన ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి బెంగుళూరు నుంచి కొచ్చికి బయలుదేరిన ఎయిరిండిమా ఎక్స్ ప్రెస్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదాం తప్పింది. విమానం క్షేమంగా ల్యాండ్ చేసి అందులో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. ఈ విమానంలో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హఠాత్తుగా విమానంలో చెలరేగిన మంటల్ని చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. పైలెట్ అధికారులకు సమాచారం అందించారు.

మొత్తానికి రన్ వేపై క్రాష్ ల్యాండ్ అయిన విమానం నుంచి ప్రయాణికులు ఓపెన్ ఎగ్జీట్ ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. కొంతమందికి స్వల్పంగా గాయాలు అయినట్లు తెలుస్తుంది. అప్పటికే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ సిద్దంగా ఉంచారు. విమానం ఆగిన వెంటనే ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. ప్రత్యేయ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను ఎయిర్ పోర్ట్ లోకి తీసుకు వెళ్లారు సిబ్బంది. ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విచారం చేసింది. మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని తెలిపింది.