iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు బెంగుళూరులో వర్షం! ఇక నీటి సమస్యకి పరిష్కారం!

నీటి సమస్యతో అల్లాడుతున్న బెంగళూరు నగరంపై వరుణ దేవుడు కరణించాడు. దాదాపు ఐదు నెలల నుంచి ఈ నగర వాసులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. బోరు బావులు అడుగంటి పోయి.. తీవ్ర స్థాయిలో నీటి కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఈనగరంలో వాన పడింది.

నీటి సమస్యతో అల్లాడుతున్న బెంగళూరు నగరంపై వరుణ దేవుడు కరణించాడు. దాదాపు ఐదు నెలల నుంచి ఈ నగర వాసులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. బోరు బావులు అడుగంటి పోయి.. తీవ్ర స్థాయిలో నీటి కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఈనగరంలో వాన పడింది.

ఎట్టకేలకు బెంగుళూరులో వర్షం! ఇక నీటి సమస్యకి పరిష్కారం!

ఈ ఏడాది ఎండకాలంలో ఎక్కువగా వినిపించిన పేరు బెంగళూరు. ఈ నగరం నీటి కరవుతో ఏ విధంగా అల్లాడుతుందో అందరికి తెలిసిందే. ఇక్కడి ప్రజలు నీటి కోసం యుద్ధాలే చేశారు. అలానే నీటి వినియోగంపై నగర అధికారులు పలు ఆంక్షలు విధించారు. సమ్మర్  ప్రారంభానికి ముందు నుంచి కూడా ఇక్కడ నీటి సమస్య ఉంది.  వేసవి ప్రారంభమయ్యే సరికి ఈ సమస్య తీవ్రత బాగా పెరిగింది. ఇక చెప్పాలంటే.. వర్షాన్ని చూసి ఐదు నెలలపైనే అయింది.  ఇలా ఎండల తీవ్రతకు నీటి కరవుతో అల్లాడుతున్న బెంగళూరు సిటీని వరుణుడు కరుణించాడు.

ఇటీవల కర్ణాటక రాజధాని, సిలికాన్ వ్యాలీ, టెక్ కంపెనీల డెస్టినేషన్ గా ఉన్న బెంగుళూరు సిటీ లో భయంకరమైన నీటి ఎద్దడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెల నుంచే అక్కడ నీటి కష్టాలు మొదలయ్యాయి. మార్చి, ఏప్రిల్ లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. నీటి కోసం అక్కడి ప్రజలు యుద్దమే చేయాల్సి వస్తోంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఇక వారు ఈ ఏడాదిలో వర్షం నీటిని చూసిందే లేదు. నీటి వినియోగంపై కూడా అక్కడి అధికారులు పలు ఆంక్షలు విధించారు. చివరకు నీటిని వృద్ధా చేస్తే జరిమానా కూడా విధిస్తున్నారు. ఇంతలా నీటి సమస్యతో అల్లాడుతున్న బెంగళూరు నగరంలో వరుణ దేవుడు కరుణించాడు. దాదాపు  ఐదు నెలల తరువాత శుక్రవారం రాత్రి నగర శివారు ప్రాంతాల్లో వాన కురిసింది.

యలహంక, కెంగెరి సహా పలుచోట్ల ఓ మోస్తారు వర్షం కురిసిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. శనివారం సిటీని మేఘాలు కమ్ముకున్నాయని, మరిన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం రాత్రి నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లో 0.29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది. దాసరహళ్లిలో 0.25 మి.మీ వర్షపాతం నమోదైందని పేర్కొంది. దీంతో బెంగళూరులో ఎండల తీవ్రత తగ్గుతుందని, శనివారం ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకున్నాయని తెలిపింది. 2024 లో ఇప్పటి వరకూ బెంగళూరులో చుక్క వాన కూడా పడలేదని ఐఏండీ పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ కాస్త అటూఇటుగా ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.