iDreamPost
android-app
ios-app

చూడటానికి హీరోయిన్‌లా ఉంది.. కానీ ఇదేం పిచ్చి పని..?

బంగారం అంటే మహిళలకు పిచ్చి. ఇది కేవలం ఇండియన్ మహిళలకే అనుకున్నారు. కాదు అని నిరూపించింది ఈ మహిళ. ఉన్నత పదవులో ఉండి కూడా ఓ పిచ్చి పని చేసి వార్తల్లో నిలిచింది.

బంగారం అంటే మహిళలకు పిచ్చి. ఇది కేవలం ఇండియన్ మహిళలకే అనుకున్నారు. కాదు అని నిరూపించింది ఈ మహిళ. ఉన్నత పదవులో ఉండి కూడా ఓ పిచ్చి పని చేసి వార్తల్లో నిలిచింది.

చూడటానికి హీరోయిన్‌లా ఉంది.. కానీ ఇదేం పిచ్చి పని..?

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా అమ్మాయిలకు. అందానికి దుస్తులకు ఎంత ఇంపార్టెన్ ఇస్తారో.. ఆభరణాల విషయంలో కూడా అంతే చూసీగా ఉంటారు. షాపింగ్ అంటే గోల్ట్ షాపింగ్ ఫస్ట్ చాయిస్‌గా మారింది మగువలకు. రోజు రోజుకు గోల్డ్ ధరలు పెరుగుతున్న కొనకుండా ఉండలేరు. వంద రూపాయలు తగ్గింది అంటే చాలు అప్పు చేసి మరీ పసిడిని కొంటుంటారు. పండుగలు, పబ్బాలతో పని లేదు. ఎప్పుడు డబ్బులు చేతికందుతాయో అప్పుడు కొనుగోలు చేస్తుంటారు. అందానికే కాకుండా అవసరాలకు కూడా అక్కరకు వస్తుండటంతో మగవాళ్లు సైతం గోల్ట్ పర్జేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ రాయబారికి ఈ బంగారంపైనే కన్ను పడింది. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది.

భారత విదేశీ రాయబారి కార్యాలయంలో పనిచేసే ఎంబస్సీ అధికారిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదైంది. 25 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ముంబయి ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికి పోయింది ఓ మహిళా రాయబారి. వివరాల్లోకి వెళితే ఇండియాలోని ఆప్ఘనిస్తాన్ దేశంలో కాన్సుల్ జనరల్ పదవిని పొందిన తొలి మహిళగా గుర్తింపు పొందింది జకియా వార్దక్. ఆమె శుక్రవారం దుబాయ్ నుండి 25 కిలోల బంగారాన్ని ఇండియాకు తీసుకు వచ్చింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆమె లగేజ్ చెక్ చేయగా.. ఎటువంటి పత్రాలు లేని బంగారాన్ని కనుగొన్నారు. వీటి విలువ భారతీయ కరెన్సీలో రూ. 18. 6 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతం ఆమె కాన్సుల్ జనరల్‌గా వ్యవహరిస్తుండటంతో ఆమెను అరెస్టు చేయలేదు.

అయితే గోల్ట్ స్మగ్లింగ్ కేసు మాత్రం ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. జకియా వెంట ఆమె చిన్న కొడుకు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన స్మగ్గింగ్ ఆరోపణలను కొట్టిపారేసింది జకియా. ఇలాంటి సమయంలో తనకు అండగా ఉండాలని ఇండియాను కోరింది. కాగా, ఈ విషయం బయటకు పొక్కడంతో మే 4 నుండి కాన్సుల్ జనరల్ పదవి నుండి తప్పించారని తెలుస్తోంది. జకియా గత ఆఫ్గాన్ ప్రభుత్వ హయాం నుండి ముంబయిలో కాన్సుల్ జనరల్‌గా వ్యహరిస్తోంది. ఇక్కడ ఆప్గాన్ రాయబార కార్యాలయాన్ని మూసివేసిన తర్వాత కూడా ఆమె అదే స్థానంలో కొనసాగుతుంది. తాలిబన్ పాలన వచ్చిన తర్వాత దౌత్య పరమైన సంబంధాలు కాబూల్ నుండి జరుగుతున్న సంగతి విదితమే. బహుశా ఓ రాయబార కార్యాలయ అధికారిని స్మగ్లింగ్ కేసులో పట్టుకోవడం దేశంలో ఇదే తొలి కేసు కావొచ్చు.