P Venkatesh
Actress Kasthuri: నటి కస్తూరి తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగు వారిపై నీచమైన కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర దుమారం రేగింది.
Actress Kasthuri: నటి కస్తూరి తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగు వారిపై నీచమైన కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర దుమారం రేగింది.
P Venkatesh
నటి కస్తూరి తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. భారతీయ జనతా పార్టీలో మహిళా నేతగా రానిస్తున్నది. అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే కదా. ఒక్కోసారి హద్దులు దాటి కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు. వ్యక్తులను ఉద్దేశించి లేదా ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంటుంది. రాజకీయంగా పెను దుమారం రేగుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో నటి కస్తూరి చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగు వారిపై నీచమైన కామెంట్స్ చేసి తన అక్కసు వెల్లగక్కింది. తమిళనాడులోని తెలుగువారిని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారు తమిళుల బానిసలంటూ రెచ్చిపోయింది. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని తక్కువచేసి మాట్లాడారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేసింది. నటి కస్తూరి చేసిన కామెంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటి కస్తూరి స్థానికంగా బ్రాహ్మణ సంఘాల సమ్మేళనానికి హాజరైంది.
అయితే తమిళనాడులో బ్రాహ్మణుల గుర్తింపు గురించి మాట్లాడే క్రమంలో తెలుగు వారి ప్రస్తావన తీసుకొచ్చారు. 300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే… మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..? అని పరోక్షంగా ద్రావిడ వాదులను ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు సీఎం క్యాబినెట్‌లో ఐదుగురు మంత్రులు తెలుగు మూలాలు ఉన్నవారే అని ఆమె పేర్కొన్నారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు, పరస్త్రీలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది వివాహం చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది అని కస్తూరి విమర్శించారు.
తెలుగు మాట్లాడే వాళ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు వారిపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు నటి కస్తూరిపై మండిపడుతున్నారు. అయితే కస్తూరి చేసి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె తన కామెంట్స్ ను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. తాను తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె వివరణ ఇచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మీడియాపై మండిపడింది. మరి తెలుగువారిపై కస్తూరి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పాత నటి కస్తూరి మాట్లాడుతూ తెలుగు స్త్రీలు రాజ అంతఃపురంలో సెక్స్ కోసం సేవ చేసేవారు
Honourable Andhra Chief Minister @ncbn
Telangana Chief Minister @revanth_anumula– Kindly take action against Actress Kasthuri.@APPOLICE100 @hydcitypolice@chennaipolice_ @prakashraaj pic.twitter.com/4Fk7ydtT3x
— Jai Samvidhan/ஜெய் சம்விதான் (@Jai__Samvidhan) November 4, 2024