కల్తీ మద్యం తాగి 34 మంది మృతి..ఆవేదనతో హీరో విజయ్ పోస్టు!

Actor Vijay: తమిళనాడు రాష్ట్రం కళ్లకుర్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ సారా తాగి 34 మృతి చెందారు. ఈ ఘటనపై ఇళయ దళపతి విజయ స్పందిస్తూ.. ఎమోషనల్ పోస్టు చేశారు.

Actor Vijay: తమిళనాడు రాష్ట్రం కళ్లకుర్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ సారా తాగి 34 మృతి చెందారు. ఈ ఘటనపై ఇళయ దళపతి విజయ స్పందిస్తూ.. ఎమోషనల్ పోస్టు చేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో ఘోరమైన ఘటన జరిగిన సంగతి తెలిసింది. కల్తీ సారా తాగి 34 మృతి చెందారు. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన తమిళనాడును కుదిపేస్తుంది.  ఈ ఘటనపై ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించారు.  కళ్లుకుర్చి ఘటనపై సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇది ఇలా ఉంటే..ఈ దారుణమైన ఘటనపై ఇళయదళపతి విజయ స్పందించారు. అంతేకాక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తమిళనాడు రాష్ట్రం కళ్లకుర్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఓ ప్రాంతంలో కల్తీ సారా తాగిన వారిలో తొలుత నలుగురు మృతి చెందారు. ఆతరువాత మృత్యుల సంఖ్య 23కి చేరింది. గురువారం ఉదయంకి మొత్తం 34 మంది కల్తీసారా తాగి మరణించారు. ఈ ఘటన యావత్త తమిళనాడు రాష్ట్రాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై పలువురు కోలీవుడ్ స్టార్ స్పందిస్తున్నారు. ఈక్రమంలోనే ఇళయ దళపతి విజయం కూడా స్పందించారు. ఈ ఘటన  షాకింగ్ కావడమే కాకుండ గుండెపగిలేది అని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 34 మంది మరణిచడం హృదయ విదారకంగా ఉందని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు విజయ్ సంతాపం తెలిపారు. అలానే చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని విజయ స్థాపించిన సంగతి తెలిసింది.  ఒక సామాన్య పౌరుడిగా, రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా స్పందిస్తూ..ఈ సంఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఇలాంటి ఘటన వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఆ విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే మళ్లీ అలాంటి ఘటనే జరగడం ప్రభుత్వ యంత్రాంగంలోని నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని విజయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందిన మృతులకు తమిళనాడు అసెంబ్లీ గురువారం నివాళులర్పించింది. అలానే కల్తీ మద్యం తాగడంతో జరిగిన మరణాలపై స్పీకర్ ఎం. అప్పారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలానే కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బాధిత ప్రజలకు వైద్యం అందించేందుకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టారన్నారు. మరి..  ఈ ఘటనపై విజయ్ చేసిన కామెంట్స్ పై  మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Show comments