iDreamPost
android-app
ios-app

ఆవుపేడతో వెండి నాణేలు! ధర ఎంత ఎంతో తెలిస్తే షాక్!

ఆవు పేడతో వెండి నాణేలు తయారీ. పేడతో నాణేలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఆవు పేడతో వెండి నాణేలు తయారీ. పేడతో నాణేలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఆవుపేడతో వెండి నాణేలు! ధర ఎంత ఎంతో తెలిస్తే షాక్!

మన దేశంలో హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తులు ఆవు పేడను, మూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీంతో పాటు ఆవు మూత్రంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని, దీని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇంతే కాకుండా దీని ద్వారా చాలా రకాల ఉపయోగాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. దీంతో పాటు ఆవు పేడతో ఎన్నో రకాల ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. కానీ, ఓ మహిళ ఆవు పేడతో వెండి నాణేలు తయారు చేసింది. ఆవు పేడతో వెండి నాణేలు తయారు చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఓ మహిళ ఆవు పేడతో వెండి నాణేలు తయారు వాటిపై దేవతల విగ్రహాలు కనిపించేలా రూపొందించి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో స్థానిక ప్రజలు ఆ మహిళను ఆశ్రయించి ఆ వెండి నాణేలను కొనుగోలు చేస్తున్నారు. ఇంతకు ఈ మహిళ ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజుల్లో వెండి, బంగారంతో తయారు చేసిన అభరణాలకు ఎంతో డిమాండ్ ఉంది. పైగా చేతిలో డబ్బు ఉంటే చాలు.. చాలా మంది అలాంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇదే ఆలోచనతో ముందుకు వెళ్లింది. ఏకంగా ఆవు పేడతో వెండి నాణేలు తయారు చేస్తున్నారు. వాటిపై వివిధ రకాలు దేవతల విగ్రహాలు వచ్చేలా తయారు చేసి ఓ స్టాల్లో అమ్ముకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ నాణేలను దీపావళి కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లుగా కూడా ఆమె తెలిపినట్లు సమాచారం.

ఈ విషయం తెలియడంతో స్థానిక ప్రజలు అంతా ఆ మహిళ ఏర్పాటు చేసుకుని స్టాల్ వద్దకు చేరుకుని ఆ వెండి నాణేలను కొనుగోలు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే? ఆమె తయారు చేసిన ఈ వెండి నాణేలను కేవలం రూ.10లకే మాత్రమే విక్రయిస్తుండడం విశేషం. ధర తక్కువ, పైగా ఆవు పేడతో తయారు చేసిన నాణేలు కావడంతో జనాలు తండోపతండాలు వచ్చి కొంటున్నారు. ఇక ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. నేను ఆవు పేడతో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తున్నానని తెలిపారు. ఇంతే కాకుండా ప్రత్యేకంగా దీపావళి పండగను దృష్టిలో ఉంచుకుని ఆవు పేడతో వెండి నాణేలు సిద్ధం చేశానని, వాటిపై లక్ష్మీ దేవి విగ్రహం వచ్చేలా రూపొందిచానని తెలిపారు.

ఇక వీటికి వెండి పూసి విక్రయిస్తున్నానని ఆ మహిళ వివరించారు. కాగా, ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావించే ఎంతో మంది ఆమె తయారు చేసిన వెండి నాణేలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. అయితే ప్రస్తుతం ఈ వెండి నాణేలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆవు పెడతో వెండి నాణేలు తయారు చేసిన ఈ మహిళ కళా నైపుణ్యంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.