iDreamPost
android-app
ios-app

ప్రియుడితో పెళ్లి చేయాలంటూ.. సెల్ టవర్ ఎక్కి

  • Published Nov 24, 2023 | 3:17 PM Updated Updated Nov 24, 2023 | 3:17 PM

అమ్మాయి ప్రేమించే వరకు వెంట పడుతూనే ఉంటాడు అబ్బాయి. ప్రేమించిన తర్వాత.. అతడే సర్వస్వం, అతడితోనే లైఫ్ అని నమ్ముతోంది ప్రియురాలు. సినిమాలు, షికార్లు, ముద్దులు, మురిపాలు అయిపోక.. తనలోని విలనిజాన్ని బయటకు తీస్తున్నాడు లవర్..

అమ్మాయి ప్రేమించే వరకు వెంట పడుతూనే ఉంటాడు అబ్బాయి. ప్రేమించిన తర్వాత.. అతడే సర్వస్వం, అతడితోనే లైఫ్ అని నమ్ముతోంది ప్రియురాలు. సినిమాలు, షికార్లు, ముద్దులు, మురిపాలు అయిపోక.. తనలోని విలనిజాన్ని బయటకు తీస్తున్నాడు లవర్..

  • Published Nov 24, 2023 | 3:17 PMUpdated Nov 24, 2023 | 3:17 PM
ప్రియుడితో పెళ్లి చేయాలంటూ.. సెల్ టవర్ ఎక్కి

ప్రేమించే వరకు నువ్వే ప్రాణం అంటూ మచ్చట్లు చెప్పే ప్రియుడు.. ప్రేమించాక మరో మాట మారుస్తూ ప్రియురాల్ని ఏమారుస్తూ ఉంటాడు. అతడి మాయ మాటలు నమ్మి.. సర్వస్వం అప్పగించాక.. మోహం చాటేస్తుంటాడు. పెళ్లి ఊసేత్తితే.. మీ కులం మా కులం వేరని, పెద్దలు ఒకప్పుకోవడం లేదని కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఉంటాడు. ప్రేమకు అడ్డు రాని కహానీలు .. పెళ్లి చేసుకోమనే సరికి సినిమా కథలు వల్లిస్తూ ఉంటాడు. చివరకు ఆమెకు హ్యాండ్ ఇస్తాడు. గతంలో అయితే మోసానికి పాల్పడిన అబ్బాయి ఇంటి ముందో, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల వెలుపల ప్రియురాలు బైఠాయించి.. తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసేవారు. ఈ యువతి మాత్రం ఏకంగా బెదిరించేందుకు దిగి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

తన ప్రియుడితో వివాహం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఓ 20 ఏళ్ల యువతి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అతడు మోసం చేశాడని పేర్కొంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్య్కూ సిబ్బంది ఆ సెల్ టవర్ వద్దకు చేరుకుని.. ఆెమెకు నచ్చజెప్పి కిందకు దించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని భితౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సెమ్రా రాజా టోల్ ప్లాజాలో సమీపంలో గురువారం జరిగిందీ ఘటన. అక్కడే ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కిన మహిళ.. ప్రియుడు తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడని, ఇప్పుడేమో మోహం చాటేస్తున్నాడంటూ పేర్కొంది. అతడితో పెళ్లి చేయాలంటూ కోరింది.

యువతి సెల్ టవర్ ఎక్కగానే.. అక్కడ జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. సెల్ టవర్ ఎక్కిన యువతి వినతి విన్న పోలీసులు.. ప్రియుడిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చి.. ఆమెను సురక్షితంగా కిందకు దింపారు. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ప్రియుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లి కోసం ఇలాంటి రిస్కులు చేయడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş