iDreamPost
android-app
ios-app

లోకో పైలట్స్ లేకుండా 70 కిమీ పరుగులు పెట్టిన రైలు

రైలు ప్రయాణాలంటే ఎవ్వరి ఇష్టముండదు చెప్పండి.. సుదూర ప్రాంతాలను చుట్టి రావాలంటూ బెస్ట్ ఆప్షన్. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్నిప్రమాదాలు ట్రైన్ జర్నీపై ఆందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా

రైలు ప్రయాణాలంటే ఎవ్వరి ఇష్టముండదు చెప్పండి.. సుదూర ప్రాంతాలను చుట్టి రావాలంటూ బెస్ట్ ఆప్షన్. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్నిప్రమాదాలు ట్రైన్ జర్నీపై ఆందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా

లోకో పైలట్స్ లేకుండా 70 కిమీ పరుగులు పెట్టిన రైలు

సుదూర ప్రాంతాలను చుట్టిరావాలంటే.. బెస్ట్ ప్రయాణ సాధనం రైలు. రిజర్వేషన్ చేసుకుంటే.. ఎంతో దూరమైనా వెళ్లి రావొచ్చు. కానీ ఇటీవల జర్నీ అంటే భయం కలిగించేలా చేశాయి కొన్ని రైల్వే ప్రమాదాలు. గత ఏడాదిలో రెండు వరుస ప్రమాదాలు అటు దేశాన్ని, ఇటు ఏపీ రాష్ట్రాన్ని వణికించేలా చేశాయి. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 280 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో రైల్వే ప్రమాదాల్లో ఘోరమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో అక్టోబర్ నెలలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మరణించిన సంగతి విదితమే. ఇవే కాకుండా చెదురు మదురుగా  యాక్సిడెంట్లు చోటుచేసుకుంటున్నాయి.

రైలు పట్టాలు తప్పిందనో, భోగీల్లో మంటలనో ఇటువంటి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ రైలు లోకో పైలెట్ లేకుండా.. పట్టాలపై పరుగులు తీసింది. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాక.. ఇసుక బస్తాలతో రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఎటువంటి రైళ్లు లేకపోవడం.. మరో దారుణ ఘటన పునరావృతం కాలేదు. వివరాల్లోకి వెళితే జమ్ముకాశ్మీర్‌నుండి పంజాబ్‌కు 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో గూడ్స్ రైలు వెళుతోంది. కథువా రైల్వే స్టేషన్ రాగానే.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ రైలు దిగి వెళ్లారు. అంతలో రైలు కదలడం స్టార్ చేసింది. రైలు మూవ్ కావడం గమనించిన లోకో పైలట్స్.. అధికారులకు సమాచారం అందించారు.

అయితే హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో.. రైలు వేగం పుంజుకుని పట్టాలపై పరుగులు తీసింది. 70 కిలో మీటర్లకు పైగా ప్రయాణించింది. ఒకానొక దశలో సుమారు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో కూడా రైలు ప్రయాణించినట్లు తెలుస్తోంది. లోకో పైలట్లు లేకుండా గూడ్స్ రైలు వెళుతుందని అధికారులకు సమాచారం అందడంతో.. అప్రమత్తమయ్యారు. ఎట్టకేలకు పంజాబ్ ముఖేరియన్‌లోని ఊంచీ బసీ సమీపంలో రైలును ఇసుక బస్తాల సాయంతో నిలిపివేశారు. అయితే సుమారు గంటన్నర పాటు లోకో పైలట్లు లేకుండా పట్టాలపై గూడ్స్ రైలు ప్రయాణించగా.. ఆ సమయంలో ఎటుంటి ట్రైన్ లేకపోవడం పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. రైలు ఆగాక.. ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.