Maharashtra: వీడియో: కూలిన హెలికాప్టర్.. శివసేన నేతకు తప్పిన ప్రమాదం!

వీడియో: కూలిన హెలికాప్టర్.. శివసేన నేతకు తప్పిన ప్రమాదం!

Maharashtra: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తుంది. నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న అపశృతులు జరుగుతున్నాయి.

Maharashtra: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తుంది. నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న అపశృతులు జరుగుతున్నాయి.

ఈ మధ్య కాలంలో విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు, పక్షులు ఢీ కొట్టడం ఇలా పలు కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాన్ని గమనించి పైలెట్లు వెంటనే సురక్షితంగా ల్యాండింగ్ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాగలుగుతున్నారు. కొన్నిసార్లు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. ఇటీవల దేశంలో ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి.. అదృష్టం బాగుండి నేతలు బతికిపోతున్నారు. అలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన రాయ్ గఢ్ జిల్లాలాోని మహద పట్టణంలో అందరూ చూస్తుండగా జరిగింది. శివసేన డిప్యూటీ నేత సుష్మా అధారే ఆ హెలికాప్టర్ లో ప్రయాణించాల్సి ఉంది. ఆయనను పికప్ చేసుకోవడానికి హెలికాప్టర్ వచ్చింది.. ల్యాండింగ్ చేసే సమయంలో హఠాత్తుగా కూలిపోయింది. ల్యాండింగ్ చేసే సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పి అటూ ఇటూ ఊగిపోయింది. పైలెట్ హెలికాప్టర్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. ఖాళీ మైదానంలో ఆ హెలికాప్టర్ భారీ శబ్దం చేస్తూ కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం దుమ్ము లేచిపోయింది.

ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే దూకేశాడు. ప్రస్తుతం పైలెట్ ప్రాణాలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో రోటరీ వింగర్ హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదం అనంతరం పోలీసులు, రెస్క్యూ బృందాలు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. శివ సేన నేత అక్కడ నుంచి కారులో ప్రచారం కోసం బయలుదేరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఈ రోజు లేచిన వేళా విశేషం బాగుంది.. లేదంటే శివసేన నేత ప్రాణాలు పోయి ఉండేవని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భూమి మీద ఇంకా ఆ నేతకు నూకలు ఉన్నాయి.. అందుకే బతికిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments