వీడియో: 10వ సారికి పదో తరగతి పాసైన యువకుడు.. బ్యాండ్ మేళంతో స్వాగతం!

Maharashtra Man: సాధారణంగా ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే..వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఓ గ్రామంలో మాత్రం పదో సారి పదో తరగతి పాసైన వ్యక్తిని చూసి.. ఆ గ్రామం అంతా సంబరం చేసుకోంది.

Maharashtra Man: సాధారణంగా ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే..వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఓ గ్రామంలో మాత్రం పదో సారి పదో తరగతి పాసైన వ్యక్తిని చూసి.. ఆ గ్రామం అంతా సంబరం చేసుకోంది.

సాధారణంగా ఎవరైనా ఏదైనా విజయం సాధిస్తే..వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారు. అదే విధంగా ఊరి కోసం ఏదైనా సాధించుకుని వస్తే.. అలాంటి వారికి ఆ ఊరంతా ఘనంగా స్వాగతం పలుకుతుంది. అంతేకాక చదువులో ఎవరైనా టాప్ గా  ఉండి.. తమ గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చినందుకు ఘనంగా  బ్యాండ్ మేళంతో, పూలు జల్లుతో స్వాగతం పలుకుతుంటారు. అయితే ఎవరైనా పది సార్లు ఫెయిలన్ అయిన వ్యక్తి తరువాత పాస్ అయితే ఎవరైనా అసలు పట్టించుకుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం పది సార్ల తరువాత పదో తరగతి పాసైన వ్యక్తినికి అక్కడి ప్రజలు భారీగా స్వాగతం పలికారు. అంతేకాక అతడిని భూజాల మీద ఎక్కించుకుని  ఊరేగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుత కాలంలో విద్యా అనేది విజ్ఞానం కంటే పోటీగా మారింది.  అందుకే చాలా మంది విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు.  ముఖ్యంగా పదో తరగతి అనేది విద్యార్థికి ప్రాథమిక స్టేజి కాబట్టి ఇక్కడ బాగా కష్టపడుతుంటారు. అలానే చాలా మంది రేయింబవళ్లు చదివి..మంచి మార్కులు సాధిస్తారు. అలానే మారుమూల ప్రాంతాల్లో ఉండే కొందరు పిల్లలు మంచి మార్కులతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని, తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబానికి మంచి పేరు తెస్తున్నారు. అలాంటి వారికి తమ గ్రామా ప్రజలు సన్మానం  సైతం చేస్తుంటారు. అయితే ఎవరైన  పరీక్షల్లో ఫెయిల్ అయిన వాడిని పట్టించుకుంటారు. అలానే  ఎక్కువ సార్లు ఫెయిల్ అయిన వాడిని అయితే చాలా హీనంగా చూస్తారు.

ఇక చాలా సార్లు ఫెయిల్ అయి..చివరకు పాసైతే.. అసలు లెక్కలోకే తీసుకోరు. అయితే ఓ గ్రామంలో మాత్రం పది సార్లు రాసిన తరువాత పదో తరగతి పాసైన యువకుడి ఆ గ్రామ ప్రజలు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర లోని బీడ్‌ ప్రాంతంలో కృష్ణ నామ్ దేవ్ ముండే  అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతకిడి చదువు అనేది సరిగ్గా అబ్బలేదు. అందుకే 2018 పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ అప్పటి నుంచి దాదాపు 10 సార్లు పదో తరగతి పరీక్షలు రాశాడు. పది సార్ల తరువాత తాజాగా పదో తరగతి పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.

అంతేకాక గుడికి వెళ్లి  పూజలు చేసి.. అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఊరంత పంచారు. అంతేకాక ఈ యువకుడిని భుజం మీద ఎక్కించుకుని ఊరంత ఊరేగించారు. ఇక వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారా అంటూ పలువుర నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలానే మీ సెలబ్రేషన్ సూపర్ బ్రో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా మీరు ఈ వీడియోను వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments