iDreamPost
android-app
ios-app

Uber Surge Pricing: 1.8 కి.మీ. దూరానికి ఏకంగా 699 రూపాయలు ఛార్జ్ చేసిన ఉబర్!

  • Published Aug 16, 2024 | 4:04 PM Updated Updated Aug 16, 2024 | 4:04 PM

Uber Charged 699 Rupees For 1.8 Km Distance: చాలా మంది ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు, క్యాబ్ ల మీద ఆధారపడిపోయారు. ఇంటి దగ్గర ఎక్కించుకుని గమ్య స్థానాల దగ్గర దింపుతుండడంతో ఎక్కువగా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే దీన్ని ఆయా కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి.

Uber Charged 699 Rupees For 1.8 Km Distance: చాలా మంది ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు, క్యాబ్ ల మీద ఆధారపడిపోయారు. ఇంటి దగ్గర ఎక్కించుకుని గమ్య స్థానాల దగ్గర దింపుతుండడంతో ఎక్కువగా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే దీన్ని ఆయా కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి.

Uber Surge Pricing: 1.8 కి.మీ. దూరానికి ఏకంగా 699 రూపాయలు ఛార్జ్ చేసిన ఉబర్!

ఇప్పుడు చాలా మంది ఓలా, ఉబర్ వంటి రైడింగ్ యాప్స్ నే వినియోగించుకుంటున్నారు. ఎంత ట్రాఫిక్ ఉన్నా గానీ టెన్షన్ లేకుండా రిలాక్స్డ్ గా వెళ్లిపోయేందుకు ఇవి బాగా ఉపయోపగడుతున్నాయి. ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండడంతో ఈ సేవలను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది. డిమాండ్ కి తగ్గట్టే ఆయా క్యాబ్, బైక్ రైడ్ కంపెనీలు కూడా భారీగానే ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. వర్షాలు పడితే పాపం.. కస్టమర్స్ నుంచి పలు రైడ్ సర్వీస్ సంస్థలు దోచుకుంటున్నాయని మండిపడుతున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు లేదా విపరీతమైన రద్దీ ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని కారణంగా సాధారణ ధరల కంటే ఎక్కువ ధరలు అనేవి ఉంటాయి.

సర్జ్ పేరుతో క్యాబ్, బైక్ రైడ్ కంపెనీలు కస్టమర్స్ నుంచి భారీగా డిమాండ్ చేస్తుండడంతో దోపిడీ చేస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ బైక్, క్యాబ్ రైడ్ కంపెనీలు తమను దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లిష్టమైన పరిస్థితులు వస్తే చాలు.. దారుణంగా ధరలు పెంచేస్తున్నాయని మండిపడుతున్నారు. ఓ వ్యక్తి అయితే మరీ దారుణంగా 1.8 కిలోమీటర్ల దూరానికి ఏకంగా రూ. 699 చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఓ ఉద్యోగి లింక్డ్ ఇన్ ఖాతా ద్వారా వెల్లడించారు. 

Uber Surge Pricing new

 

ప్రాడెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ సూర్య పాండే తనకు జరిగిన చేదు అనుభవాన్ని షేర్ చేశారు. 1990లలో స్టాక్ మార్కెట్ బూమ్ అయిన దానితో వ్యంగ్యంగా పోల్చారు. స్టాక్ మార్కెట్ కి బదులు తాను ఉబర్ యొక్క సర్జ్ ప్రైజింగ్ లో పెట్టుబడి పెట్టాలన్న దూరదృష్టి ఉండి ఉంటే గనుక ఇప్పుడు హర్షద్ మెహ్తాని మించిపోయేవాడినని సరదాగా కామెంట్స్ చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రాడెక్ట్ అతి పెద్ద లోపంగా మారడం విడ్డూరం కాదా? అంటూ కామెంట్స్ చేశారు. 

ఉబర్, ర్యాపిడో, ఓలా ఏం తీసుకున్నా గానీ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రారంభంలో మా సేవలు అందరికీ అందుబాటులోకి, సరసమైన ధరకే అని చెప్తారు. కట్ చేస్తే గురుగ్రామ్ లో మూడు వాన చుక్కలు పడితే 300 శాతం అధికంగా వసూలు చేసే రైడ్స్ వైపు చూస్తున్నారు. పార్కింగ్ ఎగ్జిట్ గేట్ దగ్గర నిలబడి ఎవరినైనా లిఫ్ట్ అడగడం కంటే ఉత్తమం మరొకటి లేదని సూర్య పాండే రాసుకొచ్చారు. 1.8 కిలోమీటర్ల దూర ప్రయాణానికి 699 రూపాయలు ఛార్జ్ చేసింది ఉబర్ కంపెనీ. అయితే దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక రెయిన్ కోట్ కొనుక్కుంటే అంతకంటే తక్కువ ధరకే బైక్ మీద వెళ్ళచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్యాబ్స్ కి పెట్టుబడి పెట్టడం కంటే సొంతంగా ఒక చిన్న కారు కొనుక్కోవడం ఉత్తమం అని అంటున్నారు.