iDreamPost
android-app
ios-app

ఈ డెలివరీ బాయ్‌ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.. కొద్ది రోజుల్లో చెల్లి పెళ్లి.. ఇంతలోనే

  • Published Mar 30, 2024 | 9:33 AM Updated Updated Mar 30, 2024 | 9:33 AM

దేశంలో చాలామంది నిరుద్యోగ యువత చుదువుకోసం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ఇలా రకరకాల కారణాలతో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబులు కింద ఫుడ్ డెలివరీ జాబ్ లు చేస్తారు. అయితే కొంతమంది ఈ ఉద్యోగంపైనే ఆధారపడిన జీవనం సాగిస్తుంటారు. తాజాగా ఫుడ్ డెలివరీ ఉద్యోగన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ యువకుడికి జొమాటో సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. కాగా, జోమాటో సంస్థ చేసిన పనికి ఆ యువకుడు సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకున్నాడు..

దేశంలో చాలామంది నిరుద్యోగ యువత చుదువుకోసం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ఇలా రకరకాల కారణాలతో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబులు కింద ఫుడ్ డెలివరీ జాబ్ లు చేస్తారు. అయితే కొంతమంది ఈ ఉద్యోగంపైనే ఆధారపడిన జీవనం సాగిస్తుంటారు. తాజాగా ఫుడ్ డెలివరీ ఉద్యోగన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ యువకుడికి జొమాటో సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. కాగా, జోమాటో సంస్థ చేసిన పనికి ఆ యువకుడు సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకున్నాడు..

  • Published Mar 30, 2024 | 9:33 AMUpdated Mar 30, 2024 | 9:33 AM
ఈ డెలివరీ బాయ్‌ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.. కొద్ది రోజుల్లో చెల్లి పెళ్లి.. ఇంతలోనే

దేశంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ గిరాకి బాగా పెరిగిపోయింది. అందువల్ల చాలామంది యువత చుదువుకోసం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ఇలా రకరకాల కారణాలతో పార్ట్ టైమ్ జాబ్ కింద ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పని చేస్తారు. అలాగే నగరంలో చాలామంది నిరుద్యోగులు కూడా తల్లిదండ్రుల పై ఆధారపడకుండా ఉండేందుకు.. డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని ఉపాధిగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీ, జొమోటో వంటి రకరకాల కంపెనీల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ గా ఫుల్ టైమ్ జాబులు కూడా చేస్తూ కుటుంబాన్ని పోషించినవాళ్లు ఉన్నారు. అయితే ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగంపైనే ఆధారపడిన జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఇది తప్ప మరో ఆర్థిక సాయం ఉండదు. తాజాగా జోమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ యువకుడికి ఆ సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. కాగా, జొమాటో సంస్థ చేసిన పనికి ఆ యువకుడు సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..

సాధారణంగా కొన్ని సాంకేతిక సమస్యల కారణాలతో అప్పుడప్పుడు జొమాటో డెలివరీ బాయ్స్ అకౌంట్ లను ఆ సంస్థ బ్లాక్ చేస్తుంది. అయితే అలా అకౌంట్ బ్లాక్ చేసినప్పుడు డెలివరీ బాయ్స్ కి ఎలాంటి ఆర్డర్స్ తీసుకోలేరు. కాగా, ఆ డెలివరీ బాయ్ కి కొత్త ఐడీ క్రియేట్ చేసుకోవాలి. అలాగే తన ఐడీ యాక్టీవ్ అయ్యేంత వరకు వేచి ఉండాలి. ఇక ఆ సంస్థ ఐడీ యాక్టీవ్ చేయడం అనేది చాలా కష్టమైనది. అయితే అచ్చం ఇలానే ఓ జొమాటో డెలివరీ బాయ్ ఖాతాను ఆ సంస్థ బ్లాక్ చేసింది. ఇక ఈ విషయం పై ఏడుస్తూ బాధపడుతున్న ఆ యువకుడి ఫోటోను ఓ నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, అందులో ఆ డెలివరీ బాయ్ చెల్లి పెళ్లి మరి కొద్ది రోజుల్లో ఉందని, అయితే అతను డబ్బులు సంపాదించే ఒకే ఒక్క ఆధారం ఈ జొమాటో ఫుడ్ డెలివరీ ఒక్కటేనని, కానీ ఇంతలోనే సంస్థ తన ఖాతాను బ్లాక్ చేయడంతో.. ఏం చేయాలో తేలియక ఢిల్లీలోని జీటీబీ నగర్ రోడ్డు పై ఏడుస్తూ కనిపించడని పేర్కొన్నాడు. అలాగే అతని ఐడీని జొమాటో సంస్థ త్వరగా యాక్టివ్ ఎక్స్ వేదికగా కోరాడు.

అలాగే మరోవైపు తన చెల్లి పెళ్లికి నెటిజన్లు కొంత ఆర్థిక సాయం చేయాలని ఆ డెలివరీ బాయ్ బ్యాంకు అకౌంట్ క్యూఆర్ కోడ్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ఎక్స్ లో ఈ పోస్ట్ కు దాదాపు 2 మిలియన్ల మంది వీక్షించడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీంతో నెటజన్లు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. దీంతో పాటు అతనికి ఆర్థిక సాయం కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు జొమాటో సంస్థ కూడా స్పందించి.. అతని జొమాటో ఐడీని వెంటనే యాక్టీవ్ చేస్తామని హామీ ఇచ్చింది. మరి, కొన్ని రోజుల్లో చెల్లి పెళ్లి ఉండగా ఇంతలోనే ఆ డెలలివరీ బాయ్ ఖాతా జొమాటో సంస్థ బ్లాక్ చేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.