P Krishna
Huge Queues at Petrol Pumps: కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ విషయంలో కొత్త చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని దేశ వ్యాప్తంగా డ్రైవర్లు ఆందోళన, రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీని ప్రభావం పెట్రోల్ బంక్ లపై కనిపిస్తుంది.
Huge Queues at Petrol Pumps: కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ విషయంలో కొత్త చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని దేశ వ్యాప్తంగా డ్రైవర్లు ఆందోళన, రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీని ప్రభావం పెట్రోల్ బంక్ లపై కనిపిస్తుంది.
P Krishna
దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కారణం హిట్ అండ్ రన్ కేసులలో దోషిగా తేలిన డ్రైవర్ కి రూ.7 లక్షల జరిమానాతో పాటు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ నిబంధనలపై దేశ వ్యాప్తంగా ఉన్న ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ, బస్స ఆపరేటర్లు పెద్ద ఎత్తున సమ్మె ప్రారంభించారు. ఆందోళన, నిరసన కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వాహనాలు, ట్రక్కులు, ట్యాంకర్లు, బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ముంబై మెట్రో పాలిటన్ రిజియన్ లో దాదాపు 1.20 లక్షల వాహనాలు ఆగిపోయినట్లు తెలుస్తుంది. మూడు రోజుల సమ్మె ప్రభావం ఇప్పుడు ఇంధనంపై చూపితుంది. వివరాల్లోకి వెళితే..
హిట్ అండ్ రన్ కేసు విషయంలో కేంద్రం తీసుకు వచ్చిన కొత్త చట్టంపై దేశంలో ఉన్న డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పాత శిక్ష చట్టం స్థానంలో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంలో డైవర్లు ప్రమాదం చేసి పారిపోయినా.. ఘటనకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు చేయకున్నా పదేళ్ల వరకు నింధితుడికి శిక్ష విధిస్తారు. ఈ క్రమంలోనే డ్రైవర్లు, ట్రాన్స్ పోర్టు అసోసియేషన్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్, మద్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ సహా ఇతర రాష్ట్రాల్లో జాతీయ రహదారులపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వందల కొద్ది ప్రైవేటు బస్సులు, లారీలు, ట్రక్కులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. కొత్త చట్టం లోని ప్రతిపాదిత సెక్షన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా డ్రైవర్లు చేస్తున్న ఆందోళన ప్రభావం ఇప్పుడు ఇంధనపై పడుతుంది. పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచి పెట్రోల్ బంకుల వద్ద జనాలు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడ్డారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పోటెత్తడంతో పలు చోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బంక్ యజమానులు పోలీసులు జోక్యం చేసుకొని కంట్రోలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు తమ వద్ద ఉన్న పాత వాహనాలు సైతం బయటకు తీసి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడక్ తదితర రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద వందల మంది కిలో మీలర్ల మేర క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#WATCH | Maharashtra: Long queues at petrol pumps in Nagpur as Transport Association, drivers protest against new law on hit and run cases. pic.twitter.com/FWgQd1F5iH
— ANI (@ANI) January 2, 2024