Swetha
ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆడవారు గొడవలు పడిన సంఘటనలను చూశాము. కానీ, బెంగుళూరు ఆర్టీసీ బస్సులో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఓ కండెక్టర్ ఓ మహిళపై చేజేసుకున్నాడు . దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆడవారు గొడవలు పడిన సంఘటనలను చూశాము. కానీ, బెంగుళూరు ఆర్టీసీ బస్సులో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఓ కండెక్టర్ ఓ మహిళపై చేజేసుకున్నాడు . దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
ఆర్టీసీ బస్సులలో రోజు రోజుకు వివాదాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో ఉచిత బస్సులు పెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులలో ఎలాంటి వివాదాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము. అటు ప్రయాణికులు, ఇటు కండెక్టర్లు, డ్రైవర్లు ఇలా అందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఓ విధంగా ఏ ఒక్కరికి కూడా సహనం అనేది లేకుండా పోతుందని చెప్పి తీరాలి. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలంటేనే.. ఓ రకమైన భయాన్ని కలిగిస్తున్నారు. తాజాగా.. బెంగుళూరు ఆర్టీసీ బస్సులో కూడా ఇలాంటి ఓ సంఘటనే చోటు చేసుకుంది. వారి మధ్య ఏ వివాదాలు తలెత్తాయో తెలియదు కానీ, ఆ బస్సులో ఉన్న కండెక్టర్ ఓ మహిళపై దారుణంగా చేజేసుకున్నాడు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెట్రోపాలిటన్ సిటీగా పిలువబడే బెంగుళూరు ఆర్టీసీ బస్సులో .. తాజాగా ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిన్న ఉదయం పది గంటల ప్రాంతంలో.. మంజుల(24) అనే యువతి తన విధులకు హాజరయ్యే క్రమంలో.. ఓ ఆర్టీసీ బస్సును ఎక్కింది. ఆ తర్వాత.. టికెట్ తీసుకునే క్రమంలో .. ఆ మహిళకు ఆ బస్సులో ఉన్న కండెక్టర్ హోనప్ప నాగప్ప అగసర్(35) మధ్య వాగ్వివాదం మొదలైంది. ఆ చిన్న గొడవ కాస్త చిలికి చిలికి గాలివానైనట్టు.. పెద్దదిగా మారింది. ఈ క్రమంలో మొదట మంజుల .. ఆ కండెక్టర్ చెంపపై కొట్టింది. దీనితో ఆ కండెక్టర్ మరింత రెచ్చిపోయి.. ఆ యువతిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తోటి ప్రయాణికులు వారిస్తున్నా సరే.. వినకుండా ఆమెను ఆటను కొడుతూనే ఉన్నాడు. దీనితో ఆమె కిందపడిపోయింది. దీనితో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది.
ఆమెకు టికెట్ ఇవ్వాలని చాలా సార్లు అడిగినా కూడా.. ఆ కండెక్టర్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాడని.. ఆ యువతి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఆ కండెక్టర్ పై చేజేసుకున్నా కానీ. అతను తన సహనం కోల్పోయి.. ఓ మహిళపై ఇంత దారుణంగా దాడి చేయడం సరైనది కాదని .. అందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు హోనప్ప నాగప్ప అగసర్ ను అరెస్ట్ చేశారు. అనంతరం అతనిని పోలీసులు సస్పెండ్ కూడా చేశారు. ఇక విచారణ జరిపిన తరువాత .. ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేది .. త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
బెంగళూరులో టికెట్ కోసం గొడవ
మహిళా ప్రయాణికురాలి మీద దారుణంగా దాడి చేసిన ఆర్టీసీ కండక్టర్. pic.twitter.com/YPG5k2EApI
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2024